బ్యాంక్‌లో వింత నిరసన.. బీఫ్‌ తినొద్దని మేనేజర్ ఆర్డర్.. ఏకంగా బీఫ్ ఫెస్టివల్ చేసుకున్న ఉద్యోగులు..

by Sujitha Rachapalli |

కేరళకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్‌కు చెందిన వ్యక్తి కెనరా బ్యాంక్ మేనేజర్‌గా నియమించబడగా.. అక్కడి క్యాంటీన్‌లో బీఫ్ ఉండకూడదని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగులు ఏకంగా బీఫ్ ఫెస్టివల్ జరుపుకున్నట్లు

బ్యాంక్‌లో వింత నిరసన.. బీఫ్‌ తినొద్దని మేనేజర్ ఆర్డర్.. ఏకంగా బీఫ్ ఫెస్టివల్ చేసుకున్న ఉద్యోగులు..
X

దిశ, వెబ్ డెస్క్ : కేరళకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్‌కు చెందిన వ్యక్తి కెనరా బ్యాంక్ మేనేజర్‌గా నియమించబడగా.. అక్కడి క్యాంటీన్‌లో బీఫ్ ఉండకూడదని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగులు ఏకంగా బీఫ్ ఫెస్టివల్ జరుపుకున్నట్లు ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. కాగా కేరళలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులతో సహా అన్ని వర్గాల ప్రజలు జీవిస్తారు. ఇక్కడ బీఫ్ తినడం చాలా సాధారణం. ఇళ్లు, రెస్టారెంట్‌లలో కూడా దొరికే బీఫ్‌పై ఇలాంటి ఆంక్షలు విధించడాన్ని రెచ్చగొట్టడం కింద తీసుకున్న ఉద్యోగులు.. ఇలా బీఫ్ ఫెస్టివల్ చేసుకున్నారని తెలుస్తోంది. ఫుడ్ చాయిస్ అనేది వ్యక్తిగతం కిందకు మాత్రమే వస్తుంది కానీ ఆదేశాల కిందకు రాదు అని ఈ విధంగా సమాధానం చెప్పారు. కాగా 2017లో బీఫ్ వినియోగాన్ని పరిమితం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలనుకుంది. కానీ ఈ విధానాలకు వ్యతిరేకంగా కేరళలో బీఫ్ ఫెస్టివల్స్ జరిగాయి.

Next Story