- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా ట్రాఫిక్ జామ్..బైకర్ ను ఎగిరి తన్నిన ఎస్పీ !
ఓ బైకర్ లైన్ దాటి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన మైసూర్ ఎస్పీ.. ఆ బైకర్ ను కాలుతో తన్నే ప్రయత్నం చేశాడు. ఈ

దిశ, వెబ్ డెస్క్: పోలీసులు.. రక్షణ కల్పించాల్సింది పోయి, జనాలపై విరుచుకుపడుతున్నారు. జనాలపైనే ఈ మధ్య దారుణాలకు ఒడిగడుతున్నారు. శాంతిగా చెప్పాల్సింది పోయి, గీత దాటుతున్నారు. అమాయక ప్రజలను కొడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య చాలానే వెలుగు చూసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా మరో సంఘటన వైరల్ గా మారింది. ట్రాఫిక్ అదుపు చేయలేక ఓ బైకర్ ను తన్నెందుకు దూసుకు వచ్చాడు ఓ పోలీస్ అధికారి. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.
బైకర్ పైకి దూసుకొచ్చిన పోలీస్ అధికారి
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో తాజాగా సీఎం సిద్ధరామయ్య పర్యటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం కాన్వాయ్ వెళ్లేందుకు రూట్ క్లియర్ చేశారు మైసూర్ పోలీసులు. ఈ సందర్భంగా మైసూర్ ఎస్పీ మల్లికార్జున ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్లియర్ చేశారు. అదే సమయంలో సుత్తూరు జాతర కారణంగా ఓ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అక్కడికి మైసూర్ ఎస్పీ చేరుకొని.. వాహనాలను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా ఓ బైకర్ లైన్ దాటి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన మైసూర్ ఎస్పీ.. ఆ బైకర్ ను కాలుతో తన్నే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనను వెనకాలే ఉన్న మిగతా వాహనదారులు మొబైల్ ఫోన్స్ లో క్యాప్చర్ చేశారు. అనంతరం సోషల్ మీడియాలో పెట్టేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు. ఇలాంటి ఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read More..
ఘోర రైలు ప్రమాదం: పట్టాలు తప్పి ఢీకొన్న రెండు హై-స్పీడ్ రైళ్లు, 21 మంది మృతి






