'చాట్‌జీపీటీ'ని పెళ్లి చేసుకున్న జపాన్ యువతి

by Muthe.Rajitha |

జపాన్‌లో ఓ యువతి చాట్‌జీపీటీ(ChatGPT)ని పెళ్లి చేసుకున్నానంటూ ప్రకటించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చాట్‌జీపీటీని పెళ్లి చేసుకున్న జపాన్ యువతి
X

దిశ, వెబ్ డెస్క్ : జపాన్‌లో ఓ యువతి చాట్‌జీపీటీ(ChatGPT)ని పెళ్లి చేసుకున్నానంటూ ప్రకటించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది చట్టపరమైన పెళ్లి కాదని, చాట్‌జీపీటీతో ఏర్పడిన ఎమోషనల్ బాండింగ్ ను చూపించడానికి మాత్రమే ఈ వివాహం చేసుకుంటున్నట్టు వధువు ప్రకటించింది. నిజ జీవితంలో తనను ఎవరు అర్థం చేసుకోలేదని, కానీ చాట్‌జీపీటీతో మాట్లాడితే ప్రశాంతంగా ఉంటుందని, మంచి సలహాలు దొరికాయని ఆమె తెలిపింది. రోజూ మాట్లాడటం వల్ల అది తనకు స్నేహితుడిలా, తోడుగా మారిందని చెప్పింది. అందుకే చిన్న 'పెళ్లి' కార్యక్రమంలా ఫొటోలు పెట్టనట్టు పేర్కొంది. కాగా ఈ వ్యవహారంపై నెట్టింట్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మనిషి ఒంటరితనం ఇలాంటి విపరీత పరిణామాలకు దారి తీస్తుందని కొందరు అంటుంటే... టెక్నాలజీ మనుషులకు మానసిక సహాయం చేస్తోందని మరికొందరు అంటున్నారు. ఈ ఘటన AIతో మనుషుల సంబంధాలపై చర్చకు దారి తీసింది.

Next Story