- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: ఇదేం ఫుడ్ రా.. కడుపు నింపడానికా.. కాటికి పంపడానికా..!
చాలా మంది స్ట్రీట్ ఫుడ్ (Street Food) వ్యాపారులకు తమదైన స్పెషల్ వంటకం ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతోంది.

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది స్ట్రీట్ ఫుడ్ (Street Food) వ్యాపారులకు తమదైన స్పెషల్ వంటకం ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతోంది. దానికోసమైన కస్టమర్లు అధికంగా వస్తుంటారని యూనిక్‌గా చేస్తుంటారు. అలాగే అనుకున్నాడు కావచ్చు ఈ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి. పైగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వింత వింత వైరెటీ కాంబినేషన్‌లో వంటకాలు వైరల్ అవ్వటం చూస్తున్నాం. చాక్లెట్ పానీపూరి, ఓరియో ఫ్రైడ్ రైస్, చాక్లెట్ ఆమ్లెట్ కొబ్బరి నీళ్ళు చిప్స్, ఐస్ క్రీం సమోసా.. అంటూ ఇలా చిత్ర విచిత్రమైన కాంబినేషన్లు సృష్టిస్తోన్నారు. ఇప్పుడు చెప్పబోయే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కూడా ఇదే కోవలోకి చెందుతాడు. ఎందుకంటే.. అతడు చేసిన ఫుడ్ వైరెటీ అలా ఉంది మరీ. ఇంతకీ ఏం చేశాడో తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియోను చూసేయండి.
ఓ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి ముందుగా కూల్ డ్రింక్ స్ట్రీంగ్ (String) బాటిల్ మూతతీసి దాన్ని పాన్‌లో పోశాడు. అనంతరం అందులో నాలుగైదు కోడి గుడ్లను పగలగొట్టి వేశాడు. అది కాస్తా కుక్ అయ్యాక టమాట ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కోత్తిమీర వేశాడు. ఈ మిక్స్చర్‌ను కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత నీట్‌గా ప్లేట్‌పై ఆకు పెట్టి అందులో కస్టమర్లకు సర్వ్ చేశాడు. చూసేందుకు పింక్ కలర్‌లో ఈ డిష్ బాగానే కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో 'మోస్ట్ యూనిక్ కోల్డ్ డ్రింక్ ఆమ్లెట్ ఇన్ ఇండియా (Most Unique Cold Drinks Omlette in India)' అని రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.. ఇదేం కాంబినేషన్ అంటూ పలువురు నొసలు చిట్లిస్తున్నారు. చాలా మంది ఇదేం వికారమైన తిండిరా బాబోయ్ అంటూ మండిపడుతున్నారు.






