బుల్లి శాస్త్రవేత్త.. నెటిజన్లను అబ్బురపరుస్తున్న బాలుడు.. ఆ వీడియో చూస్తే మైండ్ బ్లోయింగ్!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-09-08 12:10:08  IST  )

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది

బుల్లి శాస్త్రవేత్త.. నెటిజన్లను అబ్బురపరుస్తున్న బాలుడు.. ఆ వీడియో చూస్తే మైండ్ బ్లోయింగ్!?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో చూస్తునే ఉన్నాం. శాస్త్రవేత్తలు కొత్త కొత్త ఆవిష్కరణలతో నిరంతరం మానవాళికి ఉపయోగపడే అనేక విషయాలు కనుగొంటున్నారు. ఇక, ఈ ఆధునిక యుగంలో అందరూ కూడా సరికొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ.. టెక్నాలజీకి అనుగుణంగా అడుగులు వేయాల్సిందే. ప్రతి వ్యక్తిలోనూ టాలెంట్ ఉంటుంది. దానిని వినియోగించుకుంటూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. కానీ బద్దకాస్తులుగా ఉండిపోతే ప్రయోజనం లేదు. చిన్న వయసులోనే తమ లక్ష్యాలను ఏర్పరచుకొని అందుకు తగ్గట్లుగా అడుగులు వేస్తే విజయం వరిస్తుంది.

ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఓ బాలుడి ప్రతిభకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఓ చిన్నారి తమలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసే ప్రయత్నం చేశాడు. విషయంలోకి వెళితే.. ఓ బాలుడు వ్యర్థ పదార్థాలతో అచ్చం రాకెట్ లాంచర్ నమూనాను తయారు చేసి, దాని నుంచి విజయవంతంగా రాకెట్ ఇంధనాన్ని మండించాడు. ఈ బుల్లి శాస్త్రవేత్త సృజనాత్మకతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంత చిన్న వయసులో బాలుడి టాలెంట్‌ను చూసి భవిష్యత్తులో శాస్త్రవేత్త అవుతాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రతిభను ఎవరూ దాచలేరు అంటూ ఈ చిన్నారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే, అతనిలోని నైపుణ్యాన్ని ప్రోత్సహించాలని నెటిజన్లు కోరుతున్నారు. వీడియో

Next Story