Humanity : పాత కుక్కర్లో దాచిన బంగారం.. మానవత్వం చాటుకున్న తుక్కు వ్యాపారి

by Muthe.Rajitha |   (  Updated:2025-02-11 11:47:31  IST  )

రోజురోజుకీ బంగారం ధర(Gold Price) ఆకాశాన్ని అంటుతున్న కాలం ఇది.

Humanity : పాత కుక్కర్లో దాచిన బంగారం.. మానవత్వం చాటుకున్న తుక్కు వ్యాపారి
X

దిశ, వెబ్ డెస్క్ : రోజురోజుకీ బంగారం ధర(Gold Price) ఆకాశాన్ని అంటుతున్న కాలం ఇది. ఎక్కడైనా ఒక గ్రాము బంగారం(Gold) ముక్క దొరికినా ఎవ్వరికీ చెప్పకుండా జాగ్రత్తగా దాచేసుకుంటారు. కానీ తనకు తుక్కు సమాన్లలో దొరికిన బంగారాన్ని తిరగి వెతుక్కుంటూ వెళ్లి సదరు యజమానికి అప్పగించడం మాత్రం చాలా అరుదు. ఈ ఘటన కేరళ(Kerala)లో చోటు చేసుకోగా.. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేరళలోని కొల్లాం(Kollam)కి చెందిన సుమిత్ర అనే మహిళ తన ఇంట్లోని పాత కుక్కర్లో తన ఒకటిన్నర తులాల బంగారు నగలను దాచి మర్చిపోయారు. తర్వాత ఆమె ఆ కుక్కర్ ను పాత సామానులతో కలిసి తుక్కు వ్యాపారి(Ironmonger) మహేశ్ కు అమ్మేసింది. కాగా రెండు రోజుల తర్వాత ఆ కుక్కర్లో నగలను గుర్తించిన తుక్కు వ్యాపారి.. తిరిగి వారి ఇళ్ళు వెతుక్కుంటూ వచ్చి సదరు మహిళకు తిరిగి ఇచ్చివేశాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి, మీడియాకు ఎక్కడంతో.. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట్లో వైరల్(Viral News) అవుతోంది. దాదాపు లక్షన్నర విలువ చేసే బంగారాన్ని తిరిగి అప్పగించడంతో మానవత్వం ఇంకా బతికే ఉందంటూ మహేష్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు కేరళ వాసులు.

Next Story