- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసక్తికరమైన ఘటన.. తప్పిపోయిన పెంపుడు కుక్క.. 529 రోజుల తర్వాత తిరిగి ఇంటికి!
మనలో చాలామంది పిల్లులను, కుక్కలను (Pets) ఎంతో ప్రేమగా పెంచుకుంటారు.

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలామంది పిల్లులను, కుక్కలను (Pets) ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. వాటిని తన ఇంట్లో ఒక సభ్యులుగా చూసుకుంటారు. అలా అల్లారుముద్దుగా పెంచుకునే తమ పెంపుడు కుక్క కనిపించకపోతే ఎంతో కుమిలిపోతారు. కుక్క కనిపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయటం, కుక్క ఆచూకీ చెప్తే భారీగా నజరానా అందజేస్తామంటూ ప్రకటనలు ఇవ్వటం వంటి ఘటనలు కూడా గతంలో చాలానే చూశాం. తాజాగా నెట్టింట ఓ మిస్సింగ్ కుక్క స్టోరీ వైరల్‌గా మారింది. ఎందుకంటే..ఈ కుక్క తప్పిపోయిన 529 రోజులకు తిరిగి యజమానుల దగ్గరకు చేరింది. మరీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వార్త చదివేయండి.
ఆస్ట్రేలియాకు (Australia) చెందిన జార్జియా, జాషువా ఫిష్‌లాక్ అనే జంట డాక్స్‌హుండ్ జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటున్నారు. దీనికి వాలెరీ (Valerie) అని పేరు పెట్టి ఇంట్లో మనిషిలాగా చూసుకుంటున్నారు. 2023 నవంబరులో ఈ జంట కంగారూ ఐలాండ్‌కి (Kangaroo Island) ట్రిప్ వెళ్లారు. వెళ్తూ.. వెళ్తూ.. తమ పెట్ డాగ్ వాలెరీని కూడా వెంట తీసుకెళ్లారు. అయితే, అక్కడ అనుకోకుండా అడవిలో వాలెరీ తప్పిపోయింది. ఆ జంట దానికి కోసం వెతికినా ఫలితం లేకుండాపోయింది. దీంతో వారు కంగాలా వైల్డ్‌లైఫ్ రెస్క్యూ (Kangala Wildlife Rescue) ఫిర్యాదు చేశారు.
వెంటనే గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందాలు కుక్క ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. నెలల తరబడి వెతికినా ఫలితం లేకపోవటంతో వారు ఒక వ్యూహాన్ని రచించారు. వాలెరీ యజమాని ధరించిన పాత టీషర్ట్‌ను ఉపయోగించి దాన్ని పట్టుకోవాలనుకున్నారు. ఆ టీషర్టును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అడవిలోని పలు ప్రదేశాల్లో పడేశారు. దాని వాసన కనిపెట్టిన వాలెరీ చివరికి రెస్క్యూ బృందానికి చిక్కింది. దాదాపు 529 రోజుల తర్వాత తమ పెంపుడు కుక్క తిరిగి ఇంటికి రావటంతో జార్జియా, జాషువాలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే, వాలెరీ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ 'లాస్ట్ డాగ్ సిండ్రోమ్' అనే పరిస్థితి కనిపిస్తోందని వైద్యులు తెలిపారు. చాలా రోజులుగా అడవిలో ఒంటరిగా ఉండటంతో వాలెరీ మనుషులను చూసి భయపడుతుందన్నారు. త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు.






