- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIDEO: బిర్యానీ బాల్.. వేడినీళ్లు పోస్తే చాలు సెకన్లలో తినడానికి రెడీ
మనుషులు తినే ఆహారం రోజు రోజుకు మారిపోతుంది. గంటలు గంటలు కుక్ చేయాల్సిన అవసరం లేకుండా అన్నీ ఇన్ స్టంట్‌గా చేసుకునేలా దొరికిపోతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: మనుషులు తినే ఆహారం రోజు రోజుకు మారిపోతుంది. గంటలు గంటలు కుక్ చేయాల్సిన అవసరం లేకుండా అన్నీ ఇన్ స్టంట్‌గా చేసుకునేలా దొరికిపోతున్నాయి. ఇప్పటికే మార్కెట్ లో ఇన్ స్టంట్ పరోటా, చపాతీ, సూప్స్ ఇలా ఎన్నో రకాల ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎంతో మందికి ఫేవరెట్ అయిన ఇన్ స్టంట్ బిర్యానీ కూడా వచ్చేసింది. ఇప్పటికే మార్కెట్ లో ఇన్ స్టంట్ బిర్యానీ ప్యాకెట్స్ ఉన్నప్పటికీ వాటిని చేయడానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇప్పుడు క్షణాల్లోనే సిద్ధమయ్యే ఇన్ స్టంట్ బిర్యానీ బాల్స్ వచ్చాయి.
కొంతమంది క్రియేటర్లు బిర్యానీ బాల్ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోల ప్రకారం కేవలం సెకన్లలోనే వేడి వేడి బిర్యానీ సిద్ధమవుతోంది. బాల్ రూపంలో ఉన్న బిర్యానీని ఒక పాత్రలో వేసి వేడి వేడి నీళ్లు పోసిన వెంటనే ఆ బాల్ విచ్చుకుని బిర్యానీగా మారిపోతుంది. చూడ్డానికి అచ్చం బిర్యానీలానే ఇది కనిపిస్తుంది. అయితే వీడియో చూసిన నెటిజన్లు మాత్రం కొంతమంది ఏఐ వీడియో అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బతికి ఉండగానే పిండం పెట్టుకుని తిన్నట్టు ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది త్వరగా పోవడానికే ఇలాంటి తిండి తినాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం వీడియో తెగ వైరల్ అవుతోంది. video






