బాల హనుమాన్ విగ్రహానికి కిస్ ఇచ్చి.. హైఫై ఇచ్చి.. కాళ్లు మొక్కిన చిన్నారి.. క్యూట్ వీడియో.. మీరూ చూసేయండి

by Sujitha Rachapalli |

చిన్న పిల్లలు ఏది చేసినా ముద్దుగానే అనిపిస్తుంది. నవ్వినా.. ఏడ్చినా.. తిన్నా.. పడుకున్నా.. ప్రతీ సందర్భం క్యూట్‌నెస్‌తో నిండిపోతుంది. చూసేవారికి ఆనందంతో కడుపు నిండినట్లుగా ఉంటుంది.

బాల హనుమాన్ విగ్రహానికి కిస్ ఇచ్చి.. హైఫై ఇచ్చి.. కాళ్లు మొక్కిన చిన్నారి.. క్యూట్ వీడియో.. మీరూ చూసేయండి
X

దిశ, ఫీచర్స్ : చిన్న పిల్లలు ఏది చేసినా ముద్దుగానే అనిపిస్తుంది. నవ్వినా.. ఏడ్చినా.. తిన్నా.. పడుకున్నా.. ప్రతీ సందర్భం క్యూట్‌నెస్‌తో నిండిపోతుంది. చూసేవారికి ఆనందంతో కడుపు నిండినట్లుగా ఉంటుంది. ఇలాంటి ఓ ప్రెట్టీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గుడికి వెళ్లిన ఓ చిన్నారి.. బాల హనుమాన్ విగ్రహాన్ని చూసి సంతోషపడిపోయాడు. దేవుడికి ముద్దు పెట్టి.. హైఫై ఇచ్చి.. ఆ తర్వాత కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మొత్తానికి దేవుడిని తన ఫ్రెండ్‌లా ట్రీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. కామెంట్ సెక్షన్ లవ్లీ రియాక్షన్స్‌తో ఫుల్ అయిపోయింది.

హనుమాన్ అందరికీ బిగ్ బ్రదర్ లాంటి వాడు అని ఒకరు కామెంట్ చేస్తే.. నువ్వు అనుకున్నవన్నీ జరగాలిరా బుడ్డోడా అని మరొకరు ఆశీస్సులు అందించారు. ఈ చిన్నోడికి ఎలాంటి దిష్టి తగలకూడదని కోరుకుంటూ.. ఏకంగా దిష్టి తీసేస్తున్నారు. నిండు నూరేళ్లు హాయిగా జీవించాలని దీవిస్తున్నారు. ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అంటూ రీపోస్టులు పెడుతున్న నెటిజన్లు.. లక్షల్లో లైక్స్, షేర్స్‌తో ఆ పొట్టోడిని వైరల్ చేస్తున్నారు.

Next Story