ఈ గ్రామం.. దేశానికి రోల్‌మోడల్‌ : ఆనంద్ మహీంద్రా పోస్ట్‌ వైరల్‌

by Ramesh Naini |

మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్‌ సమీపంలో ఉన్న సతారా నేవార్‌ గ్రామం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది.

ఈ గ్రామం.. దేశానికి రోల్‌మోడల్‌ : ఆనంద్ మహీంద్రా పోస్ట్‌ వైరల్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్‌ సమీపంలో ఉన్న సతారా నేవార్‌ గ్రామం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. ఈ గ్రామం ఆశ్చర్యకరమైన మార్పులను సాధించిన తీరు చూసి ప్రసిద్ధ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో గ్రామానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. ‘ఇది నిజమనిపించాలని ఆపి మరోసారి చూశాను. ఇది మన దేశంలో జరిగిన ఓ నిశ్శబ్ద విజయగాథ. పెద్ద పెద్ద భవంతులు, భారీ పెట్టుబడులు లేకుండానే మార్పు సాధించవచ్చని ఈ గ్రామం నిరూపించింది’ అని తెలిపారు.

ఐదేళ్ల ప్రణాళికతో వచ్చిన మార్పు

ఒకప్పుడు సామాన్య గ్రామంలా కనిపించిన సతారా నేవార్‌ నేడు శుభ్రత, వనరుల నిర్వహణ, క్రమశిక్షణకు ప్రతీకగా మారింది. ఈ పరివర్తన వెనక స్థానిక నాయకుడు గజానన్‌ పాత్ర కీలకం. గ్రామ ప్రజలను ఒప్పించడం నుంచి అమలుకు దారి తీసే వరకు ఐదేళ్లపాటు కష్టపడి రూపొందించిన ప్రణాళిక గ్రామాన్ని పూర్తిగా మార్చేసింది. ‘మార్పుకు పెట్టుబడి కాదు, దూరదృష్టి, నాయకత్వం, ప్రజల ఐక్యత కావాలి’ అని మహీంద్రా ట్వీట్‌లో పేర్కొన్నారు.

సమాజ శక్తితో సృష్టించిన సదుపాయాలు

వైరల్ వీడియోలో గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఉచిత సౌర హీటెడ్‌ హాట్‌ వాటర్‌ సిస్టమ్‌, RO ప్లాంట్‌ ద్వారా త్రాగునీరు, అందుబాటులో వాటర్‌ ATM కార్డ్‌ సైతం. ప్రతి ఇంటికి మీటర్‌ ట్యాప్‌ నీటి సరఫరా. గ్రామంలో ఎక్కడా ఓపెన్‌ డ్రైన్లు లేవు, ప్రతి సాయంత్రం వీధులు శుభ్రం, చెత్తను బ్లూ, గ్రీన్ చెత్త డబ్బాల్లో వేర్వేరుగా వేయడం తప్పనిసరి. సౌరశక్తితో నడిచే వీధి దీపాలు. గ్రామంలో ఎక్కడ చూసినా శుభ్రత, పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలోనూ క్రమశిక్షణ కనిపిస్తున్నాయి. అసభ్య పదజాలం ఉపయోగించిన వారికి రూ.500 జరిమానా వంటి కఠిన నియమాలు గ్రామంలో ఉన్నాయి.

గ్రామమే ఒక మోడల్‌ టౌన్‌

వైరల్‌ వీడియోలో శివాజీ విగ్రహం పరిసరాలు, అందంగా పెయింట్ చేసిన కూర్చోడానికి అరుగులు, లైబ్రరీ వంటి సదుపాయాలు ఆకట్టుకుంటాయి. పెంకుటిల్లులు, గుడిసెలు ఉన్నా.. శుభ్రత విషయంలో ఎక్కడా రాజీపడరని గ్రామస్తుల జీవనశైలి స్పష్టంగా కనిపిస్తోంది.

Next Story