తల్లి పుట్టినరోజుతో లాటరీ.. ఏకంగా రూ. 240 కోట్ల జాక్ పాట్ కొట్టేసిన ఇండియన్ కుర్రాడు..

by Sujitha Rachapalli |

29 ఏళ్ల ఇండియన్ అనిల్ కుమార్ బొల్ల యూఏఈ లాటరీలో ఏకంగా రూ. 240 కోట్ల జాక్ పాట్ గెలిచాడు. ఇంత పెద్ద మొత్తం గెలవడం లాటరీ చరిత్రలోనే మొదటి సారి. కాగా అనిల్

తల్లి పుట్టినరోజుతో లాటరీ.. ఏకంగా రూ. 240 కోట్ల జాక్ పాట్ కొట్టేసిన ఇండియన్ కుర్రాడు..
X

దిశ, వెబ్ డెస్క్ : 29 ఏళ్ల ఇండియన్ అనిల్ కుమార్ బొల్ల యూఏఈ లాటరీలో ఏకంగా రూ. 240 కోట్ల జాక్ పాట్ గెలిచాడు. ఇంత పెద్ద మొత్తం గెలవడం లాటరీ చరిత్రలోనే మొదటి సారి. కాగా అనిల్ తన తల్లి పుట్టినరోజు ఆధారంగా నంబర్లను ఎంచుకుని.. మొత్తానికి ఈ లాటరీని గెలిచాడు. అది కూడా దీపావళికి ముందు కావడంతో ఎగిరి గెంతేశాడు.

అబుదాబిలో ఏడాదిన్నరగా జీవిస్తున్న అనిల్.. అక్కడకు వెళ్లినప్పటి నుంచి లాటరీలు ట్రై చేస్తున్నాడు. ఫైనల్‌గా లక్కును చేజిక్కించుకున్నాడు. కాగా అనిల్ ఇంట్లో రిలాక్స్ అవుతుండగా.. UAE లాటరీ టీమ్ నుంచి కాల్ వచ్చిందని తెలిపాడు అనిల్. ఇది తన కలలకు మించిన విషయమని.. మళ్లీ మళ్లీ చెప్పమని అడిగినట్లు చెప్పాడు. ఈ విజయం తన జీవితాన్ని మార్చేసిందని.. మొదట సూపర్ కారు కొంటానని.. ఒక నెలపాటు సెవన్ స్టార్ హోటల్‌లో ఎంజాయ్ చేస్తానని చెప్పాడు. మనీ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకుంటానని.. తన తల్లిదండ్రులను పిలిపించి కుటుంబంతో కలిసి హాయిగా జీవితాన్ని ఆస్వాదిస్తానని తెలిపాడు. ఇంకొంత డబ్బును దానం చేస్తానని, సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తానని తెలిపాడు అనిల్.

Next Story