Indian Railways: రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. ఆ వందే భారత్‌లో ఇక నో నాన్‌వెజ్

by Kema Shiva Kumar |

రైల్వే శాఖ (Railway Department)లో గత పదేళ్ల కాలంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Indian Railways: రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. ఆ వందే భారత్‌లో ఇక నో నాన్‌వెజ్
X

దిశ, వెబ్‌డెస్క్: రైల్వే శాఖ (Railway Department)లో గత పదేళ్ల కాలంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొత్త టెర్మినల్స్ (New Terminals), ఆయా రాష్ట్రాల్లో రద్దీ ఎక్కువగా ఉన్న స్టేషన్లలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా దేశంలో పాత ట్రైన్ల స్థానంలో వందే భారత్ (Vande Bharat) రైళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే మెజారిటీ రూట్లలో వందే భారత్‌ రైళ్లే నడుస్తున్నాయి. కాలం చెల్లిన ట్రైన్ల కంటే ప్రయాణికులను వందే భారత్ ట్రైన్లు వేగంగా గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. అయితే ఆ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే శాఖ భోజన సదుపాయం కూడా కల్పించింది. మెనూలో వెజ్, నాన్ వెజ్ ఫుడ్‌ను సర్వ్ చేసేశారు. కానీ, తాజాగా ఇకపై ఓ వందే భారత్‌ రైళ్లలో కేవలం వెజ్ ఫుడ్‌ను మాత్రమే ఇవ్వనున్నట్లుగా రైల్వే శాఖ ప్రకటించింది.

న్యూ ఢిల్లీ (New Delhi) నుంచి కత్రా (Kathra)లోని శ్రీ మాతా వైష్ణో దేవి (Shri Mata Vaishno Devi) ఆలయానికి వెళ్లే వందే భారత్ రైలులో నాన్ వెజ్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా రైల్వే క్యాంటీన్‌ (Railway Canteen)లో వెజ్‌, నాన్‌వెజ్‌ ఫుడ్‌ తయారు చేసేటప్పుడు ఎలాంటి తేడా ఉండదు. ఈ విషయంపై కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేయగా రైల్వే శాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. వెజ్ కావాలని ఆర్డర్ చేసిన కూడా స్వచ్ఛమైన శాఖాహార భోజనం అందడం లేదని ఆరోపించారు. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ పూర్తిగా నాన్‌ వెజ్‌ను నిషేధించింది. శ్రీ మాతా వైష్ణో దేవి (Shri Mata Vaishno Devi) ఆలయం అత్యంత పవిత్రమైన ప్రదేశమనే విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌ (Jammu Kashmir)లోని కత్రా (Kathra)లో ఉన్న ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా వెళ్తుంటారు. ముఖ్యంగా వందే భారత్ (Vande Bharat) రైలుకు వెళ్లడంతో మంసాహారం తీసుకురావడం వల్ల కొందరికి ఇబ్బందిని కలిగిస్తుంది. దీంతో ఆ రైల్లోకి మాంసాహారంతో ఉన్న స్నాక్స్ అన్నింటిని రైల్వే శాఖ నిషేధించింది.

Next Story