Viral video: పారిస్‌లో భారతీయ రాగం.. ఐఫిల్ టవర్ దగ్గర బాలీవుడ్ మెలోడి మాయ

by Yella Dhawani Reddy |

ఇటీవల కాలంలో భారతీయ సినిమాలు, పాటలు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్నాయి. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా టాలీవుడ్, బాలీవుడ్ పాటలు

Viral video: పారిస్‌లో భారతీయ రాగం.. ఐఫిల్ టవర్ దగ్గర బాలీవుడ్ మెలోడి మాయ
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో భారతీయ సినిమాలు (Indian movies), పాటలు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్నాయి. యూట్యూబ్ (Youtube), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వంటి సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా టాలీవుడ్, బాలీవుడ్ పాటలు వివిధ దేశాల వినియోగదారుల వరకు చేరుతున్నాయి. దీంతో విదేశీయులు (Foreigners) కూడా భారతీయ పాటలకు డాన్స్ చేస్తూ రీల్స్ తయారుచేసి తమ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. భారతీయ సంగీతం ఇప్పుడు సరిహద్దులను దాటి, ప్రపంచ హృదయాలను గెలుచుకుంటోంది. తాజాగా ఇలాంటి ఘటనే పారిస్‌లో (Paris) చోటుచేసుకుంది. ఐఫిల్ టవర్ (Eiffel Tower) వద్ద భారతీయ పర్యాటకులు ఆకస్మికంగా బాలీవుడ్ పాట పాడుతూ చేసిన సంగీత ప్రదర్శన ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

వీడియోలో కొంతమంది పర్యాటకులు ఐఫిల్ టవర్‌లోని ఎలివేటర్‌లో ప్రయాణిస్తున్నారు. ఇందులో పలువురు బాలీవుడ్ సినిమా చోరి చోరిలోని 'ఆజా సనం మధుర్ చాంద్ని మే' అనే పాటను పాడటం ప్రారంభించారు. దీంతో చుట్టూ ఉన్న ఫారిన్ టూరిస్టులు ఆశ్చర్యంతో ఆగి ఆ సంగీతాన్ని ఆస్వాదించారు. కొంతమంది చప్పట్లు కొడుతూ స్పందించగా, ఇంకొందరు చిరునవ్వుతో వీక్షించారు. ఇలా బాలీవుడ్ సంగీతాన్ని ఊహించని విధంగా ప్రదర్శించడం అక్కడి వాతావరణానికి ఓ ప్రత్యేక శోభ ఇచ్చింది. అందులోని టూరిస్టులు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్‌గా మారింది. అయితే, ఈ ఘటనపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఈ సన్నివేశాన్ని 'కల్చరల్ మెల్ట్‌మెలొడి'గా అభివర్ణించగా, ఇంకొందరు పబ్లిక్ ప్రదేశాల్లో ఇతరుల ప్రైవసీకి ఇది అంతరాయం కలిగిస్తుందని విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story