Indian Navy: భారత నౌకాదళం అలర్ట్‌లోనే! వీడియోలను షేర్‌ చేసిన ఇండియన్‌ నేవీ

by Ramesh Naini |   (  Updated:2025-05-12 07:12:43  IST  )

ఆపరేషన్‌ సిందూర్‌ సమయం నుంచి భారత నౌకాదళం కూడా ఆరేబియా సముద్రంలో పూర్తి సంసిద్ధతతో ఉందని ఇండియన్ నేవీ వైస్‌ అడ్మిరల్‌ ఏఎన్ ప్రమోద్‌ చెప్పిన విషయం తెలిసిందే.

Indian Navy: భారత నౌకాదళం అలర్ట్‌లోనే! వీడియోలను షేర్‌ చేసిన ఇండియన్‌ నేవీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత నౌకాదళం (Indian Navy) కూడా ఆరేబియా సముద్రం(Arabian Sea)లో పూర్తి సంసిద్ధతతో ఉందని ఇండియన్ నేవీ వైస్‌ అడ్మిరల్‌ ఏఎన్ ప్రమోద్‌ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీ స్కిమ్మింగ్‌ (sea skimming) వీడియోను ఇండియన్‌ నేవీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. యుద్ధ నౌకలపై దాడి, హై-ప్రిసిషన్ అటాక్‌ కోసం.. సముద్ర మార్గంలో రాడార్లనుంచి తప్పించుకోడానికి నీటిపై తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌లుగా పిలుస్తారు. ఇక సముద్రంలో గుర్తు తెలియని ప్లేస్‌లో భారత నేవీ హెలికాప్టర్లు చేస్తున్నాయని మరో వీడియో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గత నాలుగు రోజుల ఘర్షణ తర్వాత భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగికరించిన విషయం తెలిసిందే.

అయితే పాకిస్తాన్ మాత్రం కాల్పుల విరమణకు తూట్లు పొడిచి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సైలెంట్ వాతావరణం ఉన్నప్పటికి పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత నౌకాదళం అలర్ట్‌లోనే ఉందని తెలిపేలా ఇండియన్ నేవీ సూచనలు ఇస్తోంది. కాగా, ఈ సారి పాకిస్తాన్ ఉల్లంఘనలకు పాల్పడితే భారత్‌ ఏమి చేయనుందో వారికి తెలుసు అని తాాజాగా నేవీ అధికారి ప్రమోద్‌ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే.

Next Story