ఆంధ్రాలో రియల్ బాహుబలి అడవిదున్న.. వైరలవుతోన్న వీడియో

by Naga Rani Yarlagadda |

బాహుబలి సినిమాలో రానా దగ్గుబాటి భల్లాలదేవ క్యారెక్టర్లో నటించాడనే కంటే జీవించాడని చెప్పాలి.

ఆంధ్రాలో రియల్ బాహుబలి అడవిదున్న.. వైరలవుతోన్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: బాహుబలి సినిమాలో రానా దగ్గుబాటి భల్లాలదేవ క్యారెక్టర్లో నటించాడనే కంటే జీవించాడని చెప్పాలి. ఆ మూవీలో దున్నపోతుతో జరిగే ఫైట్ హైలైట్ గా నిలిచింది. ఆ అడవి దున్న గ్రాఫిక్సే అయినా సీన్ ని మాత్రం ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. గ్రాఫిక్స్ లో చూపించినట్లే.. రియల్ అడవి దున్న రోడ్డుపై దర్శనమిచ్చింది. ఆ

బహుశా ఆహారాన్ని వెతుక్కుంటూ వచ్చినట్లుంది. రోడ్డుకి అటువైపు, ఇటువైపు తిరుగుతూ కనిపించిన గడ్డి తింటూ తచ్చాడింది. అక్టోబర్ 8వ తేదీన అడవిదున్న మారేడుమిల్లి అటవీప్రాంతంలో రోడ్డుపై కనిపించగా.. ఒక వ్యక్తి వీడియో తీసి మన గోకవరం అడ్డా అనే పేజ్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సుమారు 45 నిమిషాలపాటు అడవిదున్న పర్యాటకులను ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. ప్రకృతిని మనం కాపాడితే.. ఆ ప్రకృతి మనల్ని, వన్యప్రాణుల్ని కాపాడుతుందనేందుకు ఇది చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది.

Next Story