- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్-పాక్ యుద్ధం.. మొదలైంది అసలైన లగ్గం..!
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో భారత్ పాకిస్థాన్‌పై మెరుపుదాడులు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో భారత్ పాకిస్థాన్‌పై మెరుపుదాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరి.. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో మాత్రం పాకిస్థాన్‌పై భారతీయులు ఘోరంగా సెటైర్లు వేస్తున్నారు. దీంతో పాక్ బలహీన పరిస్థితిపై మీమ్స్, జోకులు నెట్టింట విరివిగా వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడైతే కేవలం సిందూర్ మాత్రమే పెట్టారు.. మెహందీ, ఆపై హల్దీ కార్యక్రమం ఉంటుంది. ఇంకా సంగీత్ రాత్రికి బాంబులు, మిసైళ్లే డీజేలు.. చివరి కార్యక్రమం లగ్గానికి కూడా భారత్ మంచి మూహుర్తం పెట్టిందంటూ సెటైర్లు పేలుస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఎంతగానో ఆందోళన కలిగించేలా ఉన్నప్పటికీ, ఇప్పుడు పాకిస్థాన్ పరిస్థితిపై హాస్యరసమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక దీనివల్ల ఒత్తిడిలో ఉన్న పరిస్థితిని కొంతవరకూ ఓ చమత్కారంగా చూసే ప్రయత్నంగా విశ్లేషకులు అంటున్నారు.






