- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్రాన్స్ కంటే భారత్ సురక్షితం.. నెట్టింట చర్చకు దారితీసిన ఫ్రెంచ్ మహిళ వైరల్ వీడియో
ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళ రెండేళ్ల క్రితం భారత్‌కు వచ్చింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో టీచర్‌గా పనిచేస్తూ స్థానికంగా నివసిస్తోంది. తాజాగా ఆమెను ఓ నైజీరియాన్ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేయగా, పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా భారత్ నుంచి అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్లే వారు ఎక్కువగా ఉంటారు. అక్కడి జీవన ప్రమాణాలు మన దేశంలో కంటే మెరుగ్గా ఉంటాయని ఎన్నో కుటుంబాలు ఇతర దేశాల్లో స్థిరపడిపోతుంటారు. ఏటేటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కానీ, విదేశాల నుంచి భారత్‌కు వలస వచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. అందులోనూ అభివృద్ధి చెందిన దేశాల నుంచి భారత్‌కు వచ్చి నివసించే వారికి చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే, ఈ సాధారణ ధోరణికి భిన్నంగా ఓ ఫ్రెంచ్ మహిళ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అంతేకాదు, ఆమె తన స్వదేశం కంటే భారత్ తనకెంతో సురక్షితంగా అనిపిస్తుందని చెబుతోంది.
ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళ రెండేళ్ల క్రితం భారత్‌కు వచ్చింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో టీచర్‌గా పనిచేస్తూ స్థానికంగా నివసిస్తోంది. తాజాగా ఆమెను ఓ నైజీరియాన్ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేయగా, పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చాలా మంది భారత్‌ను సురక్షితం కాదని భావిస్తారు కానీ, భారత్ తనకు ఫ్రాన్స్ కంటే ఎక్కువగా భద్రతను కలిగిస్తోందని చెప్పింది. ఫ్రాన్స్‌లో పబ్లిక్ హరాస్మెంట్, పిక్ పాకెటింగ్ వంటి ఘటనలు తరచుగా ఎదురయ్యేవని, కానీ భారత్‌లో ఇలాంటి అనుభవాలు తాను పొందలేదని వెల్లడించింది. భారత్‌లో అర్ధ రాత్రి 3 గంటలకు కూడా ఒంటరిగా నడిచినప్పుడు కూడా తనకు భయం అనిపించలేదని, పబ్లిక్ ప్లేసుల్లో కూడా తాను భద్రతగా ఫీలవుతానని తెలిపింది.
అయితే, ఆమెకు భారత్‌పై ప్రేమ, గౌరవంతో పాటు కొంత అసహనం కూడా ఉందని వెల్లడించింది. జీవనశైలి, సమాజంలోని కొన్ని పరిస్థితులు తనకు ఇబ్బందిగా అనిపించాయని తెలిపింది. ఇక భారత్ తనకు నచ్చినప్పటికీ జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలనుకోవట్లేదని చెప్పింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చర్చకు దారితీసింది. కొంతమంది ఆమె భావనలతో ఏకీభవిస్తుండగా, మరికొందరు ఆమె దృష్టికోణాన్ని వ్యతిరేకిస్తున్నారు.






