- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నింటిలోనూ ఇండియానే గ్రేట్.. ఎన్ఆర్ఐ మహిళ వీడియో వైరల్
ఇండియాలో ఉన్నంత కంఫర్ట్ ఇంక ఏ దేశంలోనూ ఉండదని, ఈ విషయం తాను అబ్రాడ్ కు షిఫ్ట్ అయ్యాక అర్థమైందంటూ ఓ ఎన్ఆర్ఐ మహిళ చేసిన వీడియో..

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో ఉన్నంత కంఫర్ట్ ఇంక ఏ దేశంలోనూ ఉండదని, ఈ విషయం తాను అబ్రాడ్ కు షిఫ్ట్ అయ్యాక అర్థమైందంటూ ఓ ఎన్ఆర్ఐ మహిళ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇండియాలో ఓ వైబ్ ఉంటుందంటూ.. indianeyesonusa ఇన్ స్టా పేజ్ కంటెంట్ క్రియేటర్ ఓ వీడియ పోస్ట్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. తమ కలల్ని సాకారం చేసుకునేందుకు స్వదేశాన్ని వదిలి వెళ్లిన వారందరికీ ఈ విషయం తెలుస్తుందన్నారు.
స్ట్రీట్ ఫుడ్, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్, గ్రోసరీస్, వైద్య సేవలు.. ఇలా ఏ విషయంలోనైనా ఇండియానే గొప్పదన్నారు ఆమె. ఒంట్లో కాస్త బాలేకపోయినా దగ్గర్లో ఉన్న డాక్టర్ వద్దకు వెళ్లే అవకాశం ఉంటుందని, అమెరికాలో చిన్నదానికి కూడా ప్రీ అపాయింట్‌మెంట్ లేనిదే డాక్టర్ ను కలవలేమన్నారు. అంతేకాదు.. అమెరికాలో ఫ్రెండ్షిప్ కూడా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందన్నారు. సైలెంట్ గా ఉండే రోడ్లను చూసినపుడు దేశంపై బెంగగా ఉంటుందన్నారు.






