- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదృష్టమంటే తనదే.. నూడిల్స్ ఆర్డర్ పెడితే ఏం వచ్చిందో చూడండి!!(ఫొటో)
ప్రస్తుత కాలంలో అందరూ ఆన్‌లైన్ షాపింగ్, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వైపే మొగ్గు చూపుతున్నారు

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో అందరూ ఆన్‌లైన్ షాపింగ్, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో చాలామంది వంట చేసుకోవడానికి ఇష్టం లేకనో.. లేదా బాగా ఆకలిగా ఉండడంతో.. ఇప్పటికే రాత్రయింది.. వండుకునేంత ఓపిక లేదు అని భావించి.. ఆన్‌లైన్‌లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు. అనుకున్నదే ఆలస్యం ఫోన్ తీసి.. ఓ ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేసి.. ఫేమస్ రెస్టారెంట్‌లో తనకు ఇష్టమైన వంటకాన్ని ఆర్డర్ పెట్టుకుంటారు. ఇక, యువత పాస్ట్ ఫుడ్‌కు పూర్తిగా అలవాటు పడ్డారనడంలో ఆశ్చర్యం లేదు. పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక, నూడిల్స్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుంటూ మరీ తింటుంటారు
ఈ క్రమంలో నూడిల్స్ ఆర్డర్ పెట్టుకున్న ఓ మహిళకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఆస్టేలియాలోని అడిలైడ్‌లో నివసించే ఓ మహిళ గత వారం ఓ హాట్‌పాట్ టేక్‌అవే షాపు నుంచి నూడిల్స్ సూప్ ఆర్డర్ చేశారు. కొంత అక్కడే తిని, మిగిలినది ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో ఆ హాట్‌పాట్ తింటుండగా, అడుగు భాగాన ఏదో తేడాగా కనిపించింది. ఆమె నూడిల్స్ అడుగున స్పూన్‌తో తీస్తుంటే ఏదో గట్టిగా తగిలిందన్నారు. ఈ క్రమంలో ఇంకాస్త లోతుగా చూడగా, కంటైనర్ అడుగున మొబైల్ కనిపించింది. సూప్ నుంచి ఫోన్‌ను బయటకు తీసినప్పుడు.. దాని స్క్రీన్‌పై టెంపరేచర్ వార్నింగ్ కనిపించిందని ఆమె చెప్పారు. ఈ క్రమంలో ఆమె వెంటనే రెస్టారెంట్‌కు వెళ్లి నా హాట్‌పాట్‌లో ఓ ఫోన్ దొరికిందని చెప్పారు.
దీంతో వాళ్లు స్పందిస్తూ.. మా చెఫ్స్‌లో ఒకరి ఫోన్ కనపడట్లేదని తెలిపారు. ఆ ఫోన్ వారికి ఇవ్వడంతో వాళ్లు ఆమెకు థాంక్స్ చెప్పారు. ఇదే సమయంలో క్షమాపణలు కూడా చెప్పారు. దానికి ఆమె ఫర్వాలేదని అన్నారు. పొరపాటున చెఫ్ తన ఫోన్‌ను టేక్‌అవే కంటైనర్‌లో పెట్టి ఉంటారని, అది నల్లగా ఉండటం వల్ల ఆహారం ప్యాక్ చేసిన వ్యక్తి దానిని గమనించి ఉండకపోవచ్చని ఆమె వివరించారు. అయితే, ఆమె రెస్టారెంట్ పేరును వెల్లడించలేదు. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని శ్రద్ధ అనే మహిళ స్వయంగా ఓ టిక్‌టాక్ వీడియోలో పంచుకున్నారు. అది కాస్త వైరల్‌గా మారింది. దీంతో ఆ మహిళ స్పందించిన తీరుపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.






