- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ వీడియో.. సగానికి కట్ అయిన చిన్నారికి ఏం అవ్వలేదు.. సీక్రెట్ ఏంటో తెలుసా!
మ్యాజిక్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ ఇష్టపడుతుంటారు.

దిశ, వెబ్ డెస్క్: మ్యాజిక్ (Magic) అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ ఇష్టపడుతుంటారు. అరే.. ఎలా చేశారే అని ఆశ్చర్యపోతుంటారు. అందుకే ఎంటర్టైన్మెంట్ (Entertainment) కోసం స్కూళ్లు, ఫంక్షన్స్, టీవీ షోలు వంటి వివిధ ప్రోగ్రామ్‌లలో మ్యాజిక్ షోలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే మ్యాజిక్ అనేది అంత కష్టమైన పని కాదు. చిన్న చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు మ్యాజిక్ చేసేయొచ్చు. ముందుగా మ్యాజిక్ చేసే వారు మన ఏకాగ్రతను వారి చేతులపై ఉండేలా చేస్తారు. వాటిని అటూ ఇటూ ఆడిస్తూ.. మన దృష్టి ఆ చేతులపైనే ఉండేలా చేస్తారు. అదే సమయంలో తమ టాలెంట్ ప్రదర్శించి మ్యాజిక్ చేసి… వావ్ అనిపించేలా చేస్తారు. అయితే మ్యాజిక్ ఎలా చేస్తారనే విషయం ఇక్కడ ఓ చిన్నారి బయటపెట్టింది. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న వీడియో చూస్తే మ్యాజిక్‌లో ఉండే ట్రిక్ గురించి తెలుసుకోవచ్చు.
ఓ చిన్నారి చిన్న టేబుల్‌పై పడుకుని ఉంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. ఆ చిన్నారి కాళ్లు తన శరీరం నుంచి వేరై ఉన్నాయి. వీడియోలో ఓ వ్యక్తి వాయిస్ ఏం జరుగుతుందని అడుగగా.. చిన్నారి మ్యాజిక్ అంటుంది. కాళ్లు టేబుల్ కింది వైపు ఏమైనా పెట్టిందేమో అని చూడగా.. అంతా నార్మల్‌గా కనిపిస్తుంది. ఇంతలో వీడియోను టేబుల్ వెనక వైపు చూపించగా చిన్నారి 'ఇదే సిక్రెట్' అని సమాధానం చెబుతుంది. అయితే, టేబుల్‌పై ఉన్న చిన్న రంధ్రం నుంచి టేబుల్ కిందివైపు కాళ్లను పెట్టి, టేబుల్‌పై నకిలీ కాళ్లను ఉంచింది ఆ చిన్నారి. చూసేవారికి అది నిజమైనా దానిలా కనిపిస్తుంది. మ్యాజిక్‌లో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్‌తో మ్యూజిషియన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






