- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుంటే ఇట్లానే ఉంటది మరీ!
ప్రస్తుత ఆధునిక యుగంలో మానవులు టెక్నాలజీపై విపరీతంగా ఆధారపడిపోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత ఆధునిక యుగంలో మానవులు టెక్నాలజీపై విపరీతంగా ఆధారపడిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా కొత్త ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా మంది గూగుల్ మ్యాప్స్‌ను (Google maps) ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ దాదాపు అన్ని ప్రాంతాలకు సులభంగా దారిని చూపిస్తుంటుంది. అయితే, ఒక్కోసారి తప్పుదారులను కూడా చూపించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఈ యాప్ ఇచ్చే డైరెక్షన్స్ నమ్మి ఇప్పటికే గతంలో ఎంతోమంది తమ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. తాజాగా యూపీలో (Uttarpradesh) కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జాతీయ రహదారి 24పై ఘటన జరుగగా.. అదృష్టవశాత్తూ కారులోని వారందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్ గంజ్‌లో గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ డ్రైవర్ కారు నడిపించాడు. అయితే ఆ దారి నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌కి తీసుకెళ్లింది. కారుతో సహా అతను వంతెనపైకి వెళ్లాడు. దీంతో కారు ఒక్కసారిగా గాల్లో వేలాడుతూ ఆగిపోయింది. కేవలం ఇదొక్కటే కాదు. గతేడాది కూడా అలాంటి దుస్థితి అక్కడి ప్రజలను కలిచివేసింది. ఓ డ్రైవర్ గూగుల్ మ్యాప్స్‌ను అనుసరిస్తూ తప్పు దారిలో కారును నడిపి నదిలోకి నడిపాడు. ఫలితంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.






