- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Video Viral:వివాహ వేడుకలో చిరుత హల్‌చల్.. వధూవరులు ఏం చేశారో తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఇటీవల పెళ్లికి సంబంధించిన వీడియోలు, జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social Media) చాలా వేగంగా వైరల్(Viral) అవుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల పెళ్లికి సంబంధించిన వీడియోలు, జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social Media) చాలా వేగంగా వైరల్(Viral) అవుతున్నాయి. ఇక పెళ్లి అంటే బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పెళ్లి రోజున సందడి వాతావరణం నెలకొంటుంది. వివాహం అంటే వధూవరుల జీవితంలో మరిచిపోని రోజు. ఈ క్రమంలో వివాహ వేడుక(wedding ceremony) ఘనంగా జరుపుకోవాలని వధూవరులు కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో పెళ్లి రోజున వధూవరులు కలిసి పూర్తి చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉంటాయి.
ఇదిలా ఉంటే.. ఎంతో సంతోషంగా బంధుమిత్రులతో కలిసి వివాహ వేడుకలో సంబురాలు చేసుకుంటున్న ఓ జంటకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని లక్నో(Lucknow)లో ఒక వివాహ వేదికలోకి చిరుత పులి ప్రవేశించిన ఘటన చోటుచేసుకుంది. దీంతో వేదిక వద్ద గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయి. ఆ వివాహ వేడుకకు వచ్చిన అతిథులు ఒక్కసారిగా చిరుతను చూసి షాక్‌కి గురయ్యారు.
ఈ క్రమంలో అతిథులు ప్రాణాల కోసం పరుగులు తీశారు. కానీ వధూవరులు మాత్రం కారులోనే దాక్కున్నారు. ఈ క్రమంలో కొందరు అటవీ శాఖ(Forest Department) అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో చిరుతను బంధించడానికి దాదాపు 4.5 గంటలు పట్టిందని, ఒక అటవీ అధికారి కూడా గాయపడ్డాడని అని అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.






