- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోనాలిసాకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బిజినెస్ మెన్.. కాస్ట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్(Prayag Raj)లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళ(Mahakumbh Mela)లో వైరలైన మోనాలిసా(Monalisa) రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్(Prayag Raj)లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళ(Mahakumbh Mela)లో వైరలైన మోనాలిసా(Monalisa) రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. కేరళ(Kerala)లో ఆమె జువెల్లరీ షాపింగ్ మాల్(Jewellery Shopping Mall) ఓపెనింగ్ వేడుకకు హాజరయ్యారు. ఆమె రాక గురించి తెలియడంతో యువకులు మాల్ వద్దకు చేరుకున్నారు. తన లుక్ మార్చేసిన ఈ తేనె కళ్ళ చిన్నది.. అభిమానులకు అభివాదం చేసి, డాన్సులేసిన వీడియోలు వైరలవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కుంభమేళా బ్యూటీ మోనాలిసా భోస్లేకు(Monalisa Bhosle) ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మ నూర్(Bobby Chemma Noor) ఖరీదైన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చాడు. దీని విలువ దాదాపుగా రూ.15 లక్షలు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. బాబీ చెమ్మనూర్‌కు కేరళలో గోల్డ్ షాప్స్(Gold Shops) ఉన్నాయి. త్వరలోనే మోనాలిసాను తన షాప్స్‌ను ప్రమోట్ చేసుకునేందుకు బ్రాండ్ అంబాజిడర్‌గా నియమించనున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రజెంట్ కుంభమేళా బ్యూటీ మోనాలిసాకు సంబంధించిన ఏ వార్త అయిన సరే నిమిషాల్లోనే వైరల్‌గా మారుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా(Social Media) ఒకరి జీవితాన్ని ఎలా మార్చిందో చూడండంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






