- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరదాకు చేపల వేటకు వెళ్లిన జంట.. గాలానికి చిక్కింది చూసి ఒక్కసారిగా షాక్!
విదేశాల్లో సరదాగా చేపల వేటకు వెళ్లటం సర్వసాధారణం.

దిశ, వెబ్ డెస్క్: విదేశాల్లో సరదాగా చేపల వేటకు వెళ్లటం సర్వసాధారణం. ఇలా చేపల వేటకు (Fishing) వెళ్లినప్పుడు కొన్నిసార్లు వింత వింత చేపలు చిక్కటం వంటి ఆశ్చర్యకరమైన ఊహించని సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు, ఫొటోలు కూడా గతంలో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవ్వటం చూశాం. ఇక తాజాగా కూడా ఇలాంటి ఓ ఘటనే చోటుచేసుకుంది. సరదాగా చేపల వేటకు వెళ్లిన ఓ జంటకు అతి పురాతనమైన అరుదైన జాతికి చెందిన చేప చిక్కింది. మరీ ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కెనడాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను తీసుకుని సరదాగా దగ్గరల్లోని ఓ సరస్సులో చేపల వేటకు వెళ్లాడు. అక్కడ ఓ బోటులో లేక్ లోపలికి వెళ్లి చేపల కోసం గాలం వేశారు. కాసేపటికి గాలం బరువెక్కినట్లు అనిపించటంతో దాన్ని పైకి లాగి చూశారు. అంతే.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే.. వారికి అరుదైన షార్క్ జాతికి చెందిన స్టుర్గొన్ (Sturgeon) అనే చేప చిక్కింది. ఈ స్టుర్గొన్ చేపలలో 28 జాతులు ఉండగా.. వీటి శిలాజాలు డైనోసర్‌ల కంటే అనగా సుమారు 175 మిలియన్ల పూర్వకాలం నాటి నుంచి సముద్ర గర్భంలో ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు 24 అడుగుల పొడవు ఉండే ఈ చేపలు.. 2900 పౌండ్ల బరువు ఉంటాయి. ఇవి ఎక్కువగా ఫ్రెష్ వాటర్ లేక్స్, సముద్ర గర్భంలో జీవిస్తుంటాయి.






