Viral video: ఇలా ఉంటది అమ్మాయితో పెట్టుకుంటే.. అసలేం జరిగిందంటే?

by Yella Dhawani Reddy |

మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం.

Viral video: ఇలా ఉంటది అమ్మాయితో పెట్టుకుంటే.. అసలేం జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. హీరోయిన్‌ని ప్రేమలో పడేసేందుకు, ఆమెతో మాట్లాడేందుకు, చివరికి ఒక్క స్మైల్ ఇచ్చిన చాలనుకుంటూ హీరో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇక హీరోయిన్ స్మైల్ ఇచ్చాక ఆ హీరో ఆనందానికి హద్దులుండవు. గాల్లో తెలిపోతుంటాడు. తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోడు. సరిగ్గా అలాంటి ఘటన తాజాగా వెలుగుచూసింది. ఓ అమ్మాయి ఇచ్చిన స్మైల్‌కి ఓ యువకుడు ఫ్లాట్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత జరిగిన పరిమాణం తెలిస్తే అంతా షాక్ అవుతారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

సోషల్ మీడియాలో (Social media) ఓ వీడియో (Video) వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ యువకుడు బస్సు (Bus) డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆ బస్సు పక్కనే మరో బస్సు వెళ్తుంది. అయితే అందులో ఓ అమ్మాయి బస్సు విండోలొంచి ఇతడి వైపు చూడటంతో అతడు ఆమెకి హాయ్ చెప్తూ చేయి ఊపాడు. దానికి ఆ అమ్మాయి స్మైల్ ఇచ్చింది. కట్ చేస్తే.. బస్సు రోడ్డు పక్క కాలువలోకి దూసుకెళ్లింది. అంతేకాదు, బస్సు ముద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనిని నెట్టింట షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'కాస్తా చూసి నడపాలి కదా బ్రో' అంటూ కొందరు, 'ప్రపంచంలో అన్నింటి కన్న లేడీస్ వీక్నెస్ డేంజర్' అంటూ మరికొందరు, ఈ వీడియో సరదా కోసం ఎడిట్ చేసిందని, నిజమైంది కాదని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Next Story