అవమానిస్తారనుకుంటే.. ఆశీర్వదించారు! స్వలింగ వివాహానికి తల్లిదండ్రుల అద్భుత స్పందన

by Yella Dhawani Reddy |

సాధారణంగా ఆడ, మగ పెళ్లి చేసుకోవటం ప్రకృతి ధర్మం.

అవమానిస్తారనుకుంటే.. ఆశీర్వదించారు! స్వలింగ వివాహానికి తల్లిదండ్రుల అద్భుత స్పందన
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ఆడ, మగ పెళ్లి చేసుకోవటం ప్రకృతి ధర్మం. కానీ, ఇటీవల కాలంలో అబ్బాయిలు అబ్బాయిలనే పెళ్లి చేసుకోవడం, అమ్మాయిలు అమ్మాయిలనే పెళ్లి చేసుకుంటున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. సెలబ్రెటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు స్వలింగ వివాహలు (Same-sex marriages) చేసుకుంటున్నారు. అయితే, ఇందుకు సొసైటీ, తల్లిదండ్రులు సర్వసాధారణంగా అంగీకరించరు. మరీ ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో స్వలింగ వివాహం పూర్తిగా విరుద్ధంగా భావిస్తారు. కానీ, ఓ తల్లిదండ్రులు మాత్రం తమ కూతురికి స్వలింగ వివాహం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

భారత సంతతికి చెందిన సుభిక్ష సుబ్రమణి అనే మహిళ కెనడాలో (Canada) నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె టీనా అనే మరో మహిళను వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల వారు గృహ ప్రవేశ వేడుక నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి సుబ్రమణి తల్లిదండ్రులు కెనడా వెళ్లారు. వారితో పాటు ఓ పూజారిని కూడా తీసుకున్నారు. ఈ వేడుకలో భాగంగా సుబ్రమణి తల్లిదండ్రులు తమ స్వలింగ వివాహాన్ని స్వగర్వంగా అంగీకరించారని ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వేదికగా పంచుకున్నారు. అంతేకాదు, పూజారి అడిగిన ప్రశ్నలకు.. తమ కూతురి స్వలింగ వివాహం ఒక సాధారణ విషయంగా మాట్లాడటం వారిని మరింత ఆశ్చర్యానికి గురిచేసిందని ఆనందం వ్యక్తం చేశారు.

అసలు అంగీకరించరని అనుకుంటే.. తమ తల్లిదండ్రుల నుంచి ఊహించని స్పందన వచ్చిందని, ఇది మర్చిపోలేని అత్యంత మధురమైన క్షణం అంటూ సుబ్రమణి సంతోషంగా చెప్పారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై నెటిజన్లు సైతం ఆశ్యర్యపోతూ.. అందరి తల్లిదండ్రులు ఇలా అంగీకరిస్తే బాగుంటుందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story