ఐస్ క్రీమ్ చల్లగా ఉందని జుర్రుకుంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి

by Sujitha Rachapalli |

ఐస్ క్రీమ్ అనేది చాలా మందికి ఒక ఎమోషన్. కనిపిస్తే చాలు ఒక్కటి కనుక్కోవాల్సిందే అనిపిస్తుంది. కానీ ఈ వీడియో చూశారంటే.. ఐస్ క్రీమ్ అంటే విరక్తి పుట్టడం

ఐస్ క్రీమ్ చల్లగా ఉందని జుర్రుకుంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి
X

దిశ, వెబ్‌డెస్క్: ఐస్ క్రీమ్ అనేది చాలా మందికి ఒక ఎమోషన్. కనిపిస్తే చాలు ఒక్కటి కనుక్కోవాల్సిందే అనిపిస్తుంది. కానీ ఈ వీడియో చూశారంటే.. ఐస్ క్రీమ్ అంటే విరక్తి పుట్టడం ఖాయం. అంత ఘోరంగా తయారు చేస్తున్నారు మరి. కవర్ కాస్ట్‌లీగా పెట్టి బాగా కవర్ చేసినా.. తయారీ మాత్రం ఛండాలంగానే ఉంది. అపరిశుభ్ర వాతావరణంలోనే జరుగుతోంది. డ్రైనేజీ కన్నా దారుణమైన వాటర్ తీసుకుని.. బాత్రూమ్స్‌లో వాడే బకెట్ల లాంటి కంటెయినర్స్‌ సహాయంతో కలర్ కెమికల్స్ కలుపుతూ.. ఇష్టారీతిన మురికి నీటిలో పడేస్తూ.. ఫైనల్‌గా అవుట్ పుట్ మాత్రం అదిరిపోయేలా తీసుకొస్తున్నారు. కస్టమర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఫుడ్ క్వాలిటీ కనీసం మెయింటెన్ చేయట్లేదని.. మనిషి జీవితం అంటే లెక్క లేదని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి చీప్ ఐస్ క్రీమ్స్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం బెటర్ అని సూచిస్తున్నారు.

VIDEO

Next Story