Viral News : కప్పు గెలవకపోతే విడాకులు ఇస్తా : RCB అభిమాని సంచలన ప్రకటన

by Muthe.Rajitha |   (  Updated:2025-05-06 04:44:49  IST  )

ఐపీఎల్(IPL) మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు బెంగుళూర్ రాయల్ ఛాలెంజర్స్(RCB) జట్టు ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా అభిమానుల్లో హవా ఏ మాత్రం తగ్గలేదు.

Viral News : కప్పు గెలవకపోతే విడాకులు ఇస్తా : RCB అభిమాని సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్(IPL) మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు బెంగుళూర్ రాయల్ ఛాలెంజర్స్(RCB) జట్టు ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా అభిమానుల్లో హవా ఏ మాత్రం తగ్గలేదు. కప్పు గెలవకపోయినా 3 సార్లు మాత్రం ఫైనల్ లో అడుగు పెట్టింది. కాగా ఈసారి మాత్రం ఆ జట్టు 'ఈ సాలా కప్ నమ్దే' నిజం చేసేలా కనిపిస్తోంది. ఆ జట్టు అలవోకగా అన్ని మ్యాచులు గెలిచి టేబుల్ లో టాప్ ప్లేస్ లో ఉంది. ఈసారి అయినా తమ అభిమాన జట్టు కప్పు కొడుతుందని ఫ్యాన్స్ క్రేజీగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమాని(RCB Fan) ఒకరు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్లో బెంగుళూర్ జట్టు కప్పు గెలవకపోతే తన భార్యకు విడాకులు ఇస్తానని సంచలన ప్రకటన చేశాడు.

ఈసారి తమ జట్టు ఎలాగైనా ట్రోఫీ గెలుస్తుందని.. ఒకవేళ గెలవకపోతే తన భార్యను వదిలేస్తానని ఆవేశంగా చెప్పాడు. అయితే ఆ సమయంలో అతని భార్య కూడా పక్కనే ఉండటం గమనార్హం. కాగా ఆర్సీబీ డైహార్డ్ ఫ్యాన్ చేసిన ఈ వ్యాఖ్యను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఆ జట్టు గెలిస్తే మీకు కోటి రూపాయలు ఏమైనా ఇస్తారా అని ఒకరు అంటే, ఆ టీం ఓడిపోతే భార్యకు విడాకులు ఇవ్వడం పిచ్చిపని అని మరికొందరు విమర్శిస్తున్నారు, తిట్టిపోస్తున్నారు. మరి ఈసారైనా ఆ జట్టు విజయం సాధిస్తుందో లేదో చూద్దాం.

Click For Tweet..

Next Story