'నేను తప్పు చేశాను.. దయచేసి నన్ను క్షమించండి..' వీడియో రిలీజ్ చేసిన అలేఖ్య చిట్టి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-05 06:09:42  IST  )

అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles) ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను ఊపేస్తుంది.

నేను తప్పు చేశాను.. దయచేసి నన్ను క్షమించండి.. వీడియో రిలీజ్ చేసిన అలేఖ్య చిట్టి
X

దిశ, వెబ్ డెస్క్: అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles) ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను ఊపేస్తుంది. గత మూడు రోజులుగా నెటిజన్లు ఈ పికిల్స్ యాజమాన్యాన్ని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఎందుకంటే.. మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతున్న వ్యాపారాన్నిస్వయంగా చేతులారా నాశనం చేసుకోవటమే ఇందుకు కారణం. దేవుళ్లుగా భావించాల్సిన కస్టమర్లను అసభ్యకరమైన బూతులు తిట్టిన ఆడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపింది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెనర్లు (Influencers) అయిన అలేఖ్య, సుమ, రమ్య అనే ముగ్గురు సోదరీమణులు.. ఆంధ్రప్రదేశ్‌లోని (Andrapradesh) రాజమండ్రి నుంచి 'అలేఖ్య చిట్టి పికిల్స్' అనే పేరుతో పచ్చళ్ల వ్యాపారం నడుపుతున్నారు. వీరు వెజ్, నాన్-వెజ్ పచ్చళ్లను తయారు చేసి అమ్ముతారు. ముఖ్యంగా పీతలు, రొయ్యలు, చేపలు, చికెన్ వంటి నాన్-వెజ్ పచ్చళ్లతో వీరు ఫేమస్ అయ్యారు. ఇటీవల ఒక కస్టమర్ వీరి పచ్చళ్ల కోసం వాట్సాప్ గ్రూపు‌లో మెసేజ్ చేయగా ధరల వివరాలు వచ్చాయి. ఈ పచళ్ల ధరలు ఎందుకు ఇంత ఎక్కువగా ఉన్నాయని ప్రశ్నించాడు. దీంతో యజమాన్యం నుంచి చాలా అసభ్యకరమైన పదజాలంతో ఆడియో రిప్లై వచ్చింది. ఇది కాస్తా అతడు సోషల్ మీడియాలో షేర్ చేయటంతో నెటిజన్లు వీరిపై మండిపడుతున్నారు.

ఈ క్రమంలో మొదట ఈ ఆడియోపై ముగ్గురిలో ఒకరైన సుమ అనే అమ్మాయి స్పందించింది. తన చెల్లి ఆ మెసేజ్ చేసిందని తన తప్పేం లేదని, అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తనకు కూడా తెలియదని తెలిపింది. అనంతరం రమ్య అనే అమ్మాయి స్పందించి.. తమకు అర్ధరాత్రులు కూడా మెసేజులు వస్తాయని, తమని కూడా చాలా అసభ్యకరంగా తిడుతూ మెసేజులు పెడతారని, అలాంటి వారిని తాము కూడా అలానే సమాధానం చెబుతున్నామని చెప్పింది. ఆ మెసేజ్ తమని తిట్టిన వాళ్లకి చేయబోయి మరొకరికి చేసినట్లుగా వెల్లడించింది.

ఇక తాజాగా ఆడియోలో తిట్టిన అలేఖ్య చిట్టి ఈ వివాదంపై స్పందించింది. తాను తప్పుచేశానని ఒప్పుకుంది. ఇప్పటి వరకు తాను ఎవరెవరిని తిట్టిందో వారందరిని క్షమించాలని కోరింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీడియోను పోస్టు చేసింది. అయితే, దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ముందే ఎందుకు తప్పు ఒప్పుకోలేదని కొందరు ప్రశ్నిస్తుండగా, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడటం నేర్చుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More..

అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్

అలేఖ్య చిట్టి పికిల్స్ పంచాయతీ.. మా చెల్లిదే ఆ వాయిస్.. అక్కే మెసేజ్ పెట్టింది : అక్కాచెల్లెళ్లు


Next Story