- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పులున్నాయ్.. ఓ పదివేలు ఇవ్వు..! గన్‌తో బెదిరించి వారణాసిలో వింత దోపిడీ
వారణాసిలో ఓ వింత దోపిడీ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: అప్పులు ఎలాంటి మనిషినైనా.. నేరాలకు పాల్పడేలా చేస్తోందని చెప్పడానికి వారణాసిలో జరిగిన ఓ ఘటనే నిదర్శనం. ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు (Private Teacher) తుపాకీ పట్టుకుని దోపిడీకి ప్రయత్నించాడు. అయితే అతను లక్షలు డిమాండ్ చేయకుండా, కేవలం తన అప్పులు తీర్చుకోవడానికి రూ.10 వేలు ఇమ్మని ప్రాధేయపడటం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. వారణాసిలోని ఓ కామన్ సర్వీస్ సెంటర్ (CSC)లోకి ఇవాళ ఓ వ్యక్తి ప్రవేశించాడు. లోపలికి రాగానే ఒక్కసారిగా తన వద్ద ఉన్న పిస్టల్‌ను తీసి షాపు యజమానికి గురిపెట్టాడు. సాధారణంగా దోపిడీ దొంగలు గన్‌తో బెదిరించి షాపులోని నగదును లాక్కుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ‘నాకు చాలా అప్పులు ఉన్నాయి.. వాటిని తీర్చడానికి నాకు కేవలం రూ.10 వేలు ఇవ్వండి’ అని అడగడం మొదలుపెట్టాడు.
సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు..
అయితే, ఈ వింత దోపిడీ ప్రయత్నం అంతా అక్కడే ఉన్న సీసీ టీవీ (CC TV) కెమెరాల్లో రికార్డ్ అయింది. నిందితుడు గన్ చూపిస్తూనే, తన దీన స్థితిని యజమానికి వివరిస్తూ డబ్బులు అడగడం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, యజమాని చాకచక్యంగా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు. ఇక పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఒక ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని తెలిసింది. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, అప్పులు ఇచ్చిన వారు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో ఏం చేయాలో పాలుపోక ఈ దారి ఎంచుకున్నానని పోలీసులకు తెలిపాడు. నిందితుడి వద్ద ఉన్న పిస్టల్ (Pistol)ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వింత దోపిడీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
वाराणसी➡वाराणसी में CSC संचालक से लूट का प्रयास➡पिस्टल के बल से संचालक से लूट का प्रयास➡घटना सीसीटीवी में कैद, सूझबूझ से लूट नाकाम➡लोगों ने बदमाश को पीटा, पुलिस को सौंपा➡बड़ागांव थाना क्षेत्र के काजीसराय का मामला@varanasipolice pic.twitter.com/OLlJ5f613l
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) May 10, 2026






