- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIDEO: నా తల సైజు హెల్మెట్ దొరకట్లేదు సార్.. ట్రాఫిక్ పోలీస్‌తో బైకర్ ఆవేదన
బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొందరు మాత్రం హెల్మెట్ పెట్టుకోకుండా పోలీసులకు దొరికిపోతుంటారు.

దిశ, వెబ్ డెస్క్: బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొందరు మాత్రం హెల్మెట్ పెట్టుకోకుండా పోలీసులకు దొరికిపోతుంటారు. అలా దొరికిన తరవాత ఫైన్ వేస్తే బాధపడతారు. కానీ ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకోవాలని ఉన్నా పెట్టుకోలేకపోతున్నానని ట్రాఫిక్ పోలీస్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తన తల పెద్దగా ఉండటం వల్ల హెల్మెట్ పట్టడం లేదని చెప్పాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బైకర్ రోడ్డుపై వెళుతుండగా అతడిని చూసిన పోలీస్ ఆగాలని ఆదేశించాడు.
హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించగా తన తలకు పట్టడం లేదంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో పోలీస్ ఆశ్చర్యపోయి ఇలా చెప్పడం మొదటిసారి వింటున్నా అని తన వద్ద ఉన్న హెల్మెట్ ఇచ్చి అతడిని పెట్టుకోవాలని చెబుతాడు. ఆ వ్యక్తి పెట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు కానీ చెప్పినట్టే అది తలకు పట్టదు. దీంతో కానిస్టేబుల్ నవ్వుతూ.. హెల్మెట్ కంపెనీలు కాస్త పెద్ద తల ఉన్నవారి కోసం కూడా సైజు పెంచి హెల్మెట్లను తయారు చేయాలని రిక్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు సైతం నవ్వేస్తున్నారు. video






