- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోగాన్ని సెకన్లలో కనిపెట్టిన ఏఐ.. పిజ్జా షాపులో పనిచూసుకుంటానంటున్న డాక్టర్ పోస్ట్ వైరల్
ప్రస్తుతం ఏఐ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఏ రేంజ్‌లో పనిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోడింగ్, కంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్ ఇలా చాలా పనులను ఏఐ కచ్చితంగా చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఏఐ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఏ రేంజ్‌లో పనిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోడింగ్, కంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్ ఇలా చాలా పనులను ఏఐ కచ్చితంగా చేస్తోంది. అంతే కాకుండా వైద్య రంగంలోనూ ఏఐ వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ డాక్టర్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. ఫౌజీ కాట్రాంజి అనే ఓ డాక్టర్ తన సోషల్ మీడియాలో పోస్టులో నిమోనియాతో బాధపడుతున్న వ్యక్తి ఊపిరితిత్తుల ఎక్స్ రేకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు.
తాను ఎక్స్ రే చూపించి వ్యాధిని గుర్తించాలని ఏఐని కోరగా క్షణాల్లోనే అది వ్యాధిని గుర్తించింది అంటూ అవాక్కయ్యాడు. అంతే కాకుండా ఏఐ వల్ల తన ఉద్యోగం కూడా పోతుందని అన్నాడు. ఏఐ భయంకరంగా ఉందని, తాను 20 ఏళ్లపాటూ కష్టపడి డాక్టర్ గా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే ఏఐ వచ్చి క్షణాల్లోనే చెప్పేస్తోంది అన్నాడు. నిమోనియాను గుర్తించడానికి ప్రొఫెషనల్ డాక్టర్లు ఇకపై అవసరం ఉండదేమో అని ఏఐ పక్కాగా చూపిస్తోందని అన్నాడు.
అంతే కాకుండా ఏఐ వల్ల తాను ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మెక్ డోనాల్డ్స్‌కు దరఖాస్తు చేసుకుంటానని ఫన్నీగా చెప్పాడు. అక్కడ ఓపెనింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం ఆ డాక్టర్ చేసిన పోస్టు ఇన్ స్టాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు మీ ఉద్యోగం ఎక్కడికీ పోదని కానీ ఏఐ మీకు వ్యాధులను నిర్ధారించడం మరింత సులువు చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు.






