- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్.. ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు.. భార్యకు బలవంతంగా పెళ్లి చేసిన భర్త..
ఉత్తరప్రదేశ్ అమేథీలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఉమ, శివ శంకర్‌కు ఆరు నెలల క్రితం మ్యారేజ్ అయింది. కానీ భార్య తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో కాంటాక్ట్‌లో ఉందని గుర్తించాడు భర్త. ఇలాంటివి వద్దని.. ఇద్దరం హ్యాపీగా ఉందని నచ్చజెప్పాడు. అయితే భార్య మాత్రం ఎక్స్‌తోనే జీవించేందుకు సిద్ధమైంది.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ అమేథీలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఉమ, శివ శంకర్‌కు ఆరు నెలల క్రితం మ్యారేజ్ అయింది. కానీ భార్య తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో కాంటాక్ట్‌లో ఉందని గుర్తించాడు భర్త. ఇలాంటివి వద్దని.. ఇద్దరం హ్యాపీగా ఉందని నచ్చజెప్పాడు. అయితే భార్య మాత్రం ఎక్స్‌తోనే జీవించేందుకు సిద్ధమైంది. దీంతో భర్త ఆమెను తన ప్రియుడికి ఇచ్చి జగదీష్‌పురలోని ఓ ఆలయంలో పెళ్లి చేయించాడు. ఇద్దరు దండలు మార్చుకుని.. సింధూరం దిద్దగా.. భార్యాభర్తలుగా పరిగణించబడ్డారు. ఇదంతా ఇప్పటి వరకు జరిగిన కథ. కానీ ఇందులో ట్విస్ట్ ఉందంటూ మీడియా ముందుకొచ్చింది భార్య ఉమ.
భర్త శివశంకర్ పూర్తిగా అబద్ధం చెప్తున్నాడని.. ఇదంతా నాటకమని.. సింపథీ గెయిన్ చేసేందుకు ఈ స్టోరీ అల్లాడని చెప్పుకొచ్చింది. నిజానికి తనతో పెళ్లి జరిపించిన వ్యక్తి తనకు సోదరుడు అవుతాడని.. పోలీసుల సహాయంతో కిడ్నాప్ చేయించి.. బలవంతంగా పెళ్లి చేశారని తెలిపింది. తన అడ్డు తొలగించుకుని పార్వతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకునే ప్రయత్నంలో భాగంగా.. భర్త శివకుమార్ ఈ డ్రామా మొదలుపెట్టాడని వివరించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే విచారణ జరగాలి. అంతవరకు ఈ కేసు అసలు కథ ఏంటో తెలుసుకునేందుకు వెయిట్ చేయాల్సిందే.






