ఏడేళ్ల క్రితం భర్త మిస్సింగ్.. అసలు గుట్టు బయటపెట్టిన రీల్స్..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ అజంగఢ్ జిల్లాలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. అటమావు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఏడేళ్ల క్రితం మిస్ అయ్యాడు. అతనికి అప్పటికే వివాహం కాగా ఓ కొడుకు కూడా ఉన్నాడు. దీంతో భార్య, అతని తల్లిదండ్రులు.. అతని కోసం గాలించారు.

ఏడేళ్ల క్రితం భర్త మిస్సింగ్.. అసలు గుట్టు బయటపెట్టిన రీల్స్..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ అజంగఢ్ జిల్లాలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. అటమావు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఏడేళ్ల క్రితం మిస్ అయ్యాడు. అతనికి అప్పటికే వివాహం కాగా ఓ కొడుకు కూడా ఉన్నాడు. దీంతో భార్య, అతని తల్లిదండ్రులు.. అతని కోసం గాలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చివరకు అతని పేరెంట్స్.. అత్తామామలు కొడుకును చంపారని ఆరోపించారు. దీనిపై ఇంకా కేసు నడుస్తున్నట్లు తెలుస్తోంది. కనిపించకుండా పోయిన వ్యక్తి తల్లిదండ్రులు ఆశలు వదిలేసుకున్నారు. కానీ భార్య మాత్రం పుట్టింట్లోనే ఉంటూ భర్త రాకకోసం ఎదురుచూస్తూ బతుకుతోంది. ఎన్నటికైనా తన దగ్గరకు వస్తాడనే ఆశతో ఉంది.

అయితే సరిగ్గా ఏడేళ్ల తర్వాత సదరు భర్త.. లూధియానాలో మరో మహిళతో రీల్స్ చేస్తూ దొరికిపోయాడు. ఈ రీల్ కాస్త భార్య దగ్గరకు చేరడంతో.. అసలు నిజం బయటకు వచ్చింది. కావాలనే అతను పారిపోయాడని.. మరో స్త్రీతో జీవితం కోసం ఇంతకు తెగించాడని నిర్ధారణ అయింది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా సోషల్ మీడియా వల్ల ఇలాంటి బెనిఫిట్ జరగడం చాలా ఆనందంగా ఉందంటున్నారు నెటిజన్లు. అతనే ప్రాణంగా జీవిస్తున్న భార్యను ఇంత మోసం చేస్తున్న భర్త గుట్టును ఒక్క రీల్ బయటపెట్టిందని కామెంట్ చేస్తున్నారు.

VIDEO

Next Story