- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా ఆయనకు మళ్లీ పెళ్లి.. భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు.. పేపర్‌లో యాడ్ కూడా..
సోషల్ మీడియాలో వింతలకు కొదువ లేదు. ఎంత స్క్రోల్ చేస్తే అన్ని వింతలు, విశేషాలు చూడొచ్చు. నవ్వుకోవచ్చు. ఏడవొచ్చు. షాక్ కూడా కావొచ్చు. ఇలాంటిదే ఈ పోస్ట్ కూడా. ఓ వ్యక్తికి ఆల్రెడీ ఇద్దరు భార్యలు ఉండగా

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో వింతలకు కొదువ లేదు. ఎంత స్క్రోల్ చేస్తే అన్ని వింతలు, విశేషాలు చూడొచ్చు. నవ్వుకోవచ్చు. ఏడవొచ్చు. షాక్ కూడా కావొచ్చు. ఇలాంటిదే ఈ పోస్ట్ కూడా. ఓ వ్యక్తికి ఆల్రెడీ ఇద్దరు భార్యలు ఉండగా.. దగ్గరుండి మరో అమ్మాయితో భర్తకు మూడో పెళ్లి చేస్తున్నారు. ఊర్లో పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి.. అతిథులను ఆహ్వానించారు. పేపర్‌లో యాడ్స్ కూడా వేయించారు.
‘పండన్న వెడ్స్ లావ్య’ అంటూ పెళ్లి చేసుకోబోతున్న వధూవరుల ఫొటోలతో సహా పేర్లను బ్యానర్‌పై రాయించారు. వివాహానికి ఆహ్వానిస్తున్న ఇద్దరు భార్యల పేరు పార్వతమ్మ, అచ్చలమ్మగా ఉన్నాయి. కీందూరు గ్రామంలో జరిగిన ఈ పెళ్లికి వచ్చిన బంధువులు కూడా అవాక్కయ్యారు. ఇక ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అలా ఎలా మావ అని కొందరు అంటుంటే.. పిల్లాడికి లక్కీ చాన్స్ దొరికిందిపో అని కామెంట్ చేస్తున్నారు.






