- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లైన 4 రోజులకే ప్రియుడితో భార్య రొమాన్స్.. భర్త ఏం చేశాడంటే?
ఈ మధ్య ఇల్లీగల్ రిలేషన్ షిప్స్ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా 30 నుండి 40 ఏళ్ల మధ్యవారే ఇలాంటి సంబంధాలు ఎక్కువగా పెట్టుకుంటున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. మహిళలు, పురుషులు ఎవరూ తక్కువ కాదు అనుకుంటూ ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య ఇల్లీగల్ రిలేషన్ షిప్స్ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా 30 నుండి 40 ఏళ్ల మధ్యవారే ఇలాంటి సంబంధాలు ఎక్కువగా పెట్టుకుంటున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. మహిళలు, పురుషులు ఎవరూ తక్కువ కాదు అనుకుంటూ ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. కొందరు కాలేజీలో ప్రేమించుకుని తల్లిదండ్రుల బాధకు మరొకరిని వివాహం చేసుకుంటున్నారు. తరవాత వారితో ఉండలేక మళ్లీ ప్రేమించినవారిని వెతుక్కుంటూ వెళుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
పెళ్లైన నాలుగు రోజులకు ఓ మహిళ తన ప్రియుడితో కలిసి బయటకు వెళ్లింది అతడితో కలిసి మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో ఇద్దరూ హద్దులు దాటి రెచ్చిపోయారు. ఒకరినొకరు ముద్దాడటంతో దానికి సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పెళ్లి చేసుకున్న భర్త ఆమెను విడిచిపెట్టి తన దారి తాను చూసుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహిళ ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో జెన్ జీ అంతా ఇలానే ఉంది విమర్శలు వస్తున్నాయి. యువత పెళ్లికి ముందే నచ్చినవారిని పెళ్లిచేసుకోవాలని కానీ ఇలా మరొకరి జీవితంతో ఆడుకోవద్దని కోరుతున్నారు.






