- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL VIDEO: ఓవైపు భక్తి మరోవైపు ఆకలి.. దేశంలో పేదరికం ఇంత దారుణంగా ఉందా?
దేశంలో పేదరికం ఇంతలా ఉందా అనుకునేలా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన మొక్కు తీర్చుకునేందుకు గంగానదిలో పాలను పోస్తుంటే అక్కడకు వచ్చిన పేద బాలికలు వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: దేశంలో పేదరికం ఇంతలా ఉందా అనుకునేలా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన మొక్కు తీర్చుకునేందుకు గంగానదిలో పాలను పోస్తుంటే అక్కడకు వచ్చిన పేద బాలికలు వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాలు గంగానదిలో పడుతుంటే తమ పాత్రలో కొన్ని పడినా చాలు అంటూ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ ఆ వ్యక్తి తన మొక్కు తీర్చుకోవాలన్న ఆరాటంతో వారి పాత్రలో పోయకుండా పాలన్నీ నదిలోనే పోశాడు.
దీంతో నిరాశతో ఆ చిన్నారులు వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ వీడియో చాలా మందిలో ఆచారాలను పాటించడం కంటే ఆకలిని తీర్చడం ముఖ్యమేమో అనే ప్రశ్నను సైతం లేవనెత్తుతోంది. మరోవైపు స్కూలుకు వెళ్లి చదువుకోవాల్సిన చిన్నారులు గంగానదిలో పోసే పాల కోసం పాత్రలు పట్టుకుని వెంటపడటం చూస్తుంటే దేశంలో పేదరికం ఈ స్థాయిలో ఉందా అనేలా చేస్తుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు భక్తి కంటే చిన్నారుల పాత్రల్లో పాలు పోస్తే కడుపునిండేదని అప్పుడు మరింత మోక్షం లభించేదని కామెంట్స్ చేస్తున్నారు.






