- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెడ్రూం సీలింగ్‌లోంచి వింత శబ్దాలు.. పగలగొట్టి చూస్తే షాక్? అందులోనే కాపురం.. (వీడియో)
సాధారణంగా చాలా మంది పాముల వీడియోలు చూసిన భయపడిపోతారు..

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా చాలా మంది పాముల వీడియోలు చూసిన భయపడిపోతారు. కొంత మంది పాములను దూరం నుండి చూడటానికి కూడా ఇష్టపడరు. కానీ, ఓ ఇంటి పైకప్పులోనే పాములు ఉన్నాయి. ఓ కుటుంబానికి రాత్రి నిద్రపోతుండగా వింత శబ్ధాలు వినిపించాయి. అవేంటా అని చూసి వణికిపోయారు. ఇంటి సీలింగ్‌లో పెద్ద పెద్ద పాములు ఏకంగా కాపురం పెట్టేశాయి.
వివరాల ప్రకారం.. మలేషియాలో నివసిస్తున్న ఓ కుటుంబం రాత్రి బెడ్రూంమ్‌లో నిద్రపోతున్న సమయంలో వింత శబ్ధాలు వినిపించాయి. అయితే అది విన్న కుటుంబ సభ్యులు చిరాకు పడ్డారు. ఆ తర్వాత శబ్దాలు ఎక్కువ కావడంతో భయపడి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. అనుమానం వచ్చి ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం అందించారు. అయితే ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి కట్టెతో కొద్దిగా సీలింగ్‌ను పగలగొట్టి చూశారు. అప్పుడు సిలింగ్‌లో ఒక పాము తోక కనిపించడంతో సీలింగ్‌ను బద్దలు కొట్టి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. మూడు భారీ పొడవున్న పాములు కనిపించాయి. ఫారెస్ట్ సిబ్బంది వాటిని జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ ఐఎఫ్‌ఎస్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
मुहावरा: छप्पर फाड़ के देना। उदाहरण : ….,,. 🤷🏻♂️ pic.twitter.com/ojgLtPJct7
— Saket Badola IFS (@Saket_Badola) February 14, 2023






