తత్కాల్ టికెట్లు బుక్ చేసేటపుడు ఆధార్ ఎలా వెరిఫై చేయాలి?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-19 00:31:07  IST  )

ఐఆర్‌సీటీసీ (IRCTC) ద్వారా తత్కాల్ టికెట్ బుకింగ్ చేసే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ జూన్ 17న ప్రకటించిన ప్రకారం.. 2025 జూలై 1వ తేదీ నుంచి టత్కాల్ టికెట్లు బుక్ చేసేందుకు ఆధార్ ఆధారిత గుర్తింపు తప్పనిసరి కానుంది.

తత్కాల్ టికెట్లు బుక్ చేసేటపుడు ఆధార్ ఎలా వెరిఫై చేయాలి?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐఆర్‌సీటీసీ (IRCTC) ద్వారా తత్కాల్ టికెట్ బుకింగ్ చేసే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ జూన్ 17న ప్రకటించిన ప్రకారం.. 2025 జూలై 1వ తేదీ నుంచి టత్కాల్ టికెట్లు బుక్ చేసేందుకు ఆధార్ ఆధారిత గుర్తింపు తప్పనిసరి కానుంది. ఈ నిబంధనలు ఆన్‌లైన్ బుకింగ్‌పై ఎక్కువ ప్రభావం చూపనున్నాయి.

కొత్త నిబంధనల ప్రకారం.. తత్కాల్ బుకింగ్ విండో ఓపెన్ అయిన మొదటి 30 నిమిషాల పాటు కేవలం ఆధార్ అథెంటికేషన్ చేసి, కేవైసీ పూర్తి చేసిన వినియోగదారులకే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. జూలై 15 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఆధార్ ఆధారిత ఓటీపీ వేరిఫికేషన్ కూడా తప్పనిసరి కానుంది. ఈ చర్యల ద్వారా టికెట్లు నిజమైన ప్రయాణికులకే అందేలా చూసే ఉద్దేశముందని రైల్వే శాఖ వెల్లడించింది. మధ్యవర్తులు, బాట్స్ ద్వారా టికెట్లు బుక్ చేసే వ్యవస్థపై ఇది కీలక నియంత్రణగా భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో IRCTC అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయడం, వాడదగిన విధంగా దానిని అథెంటికేట్ చేయడం అత్యవసరంగా మారింది. ఆధార్ లింకింగ్ (Aadhar Linking), వాలిడేషన్ ప్రక్రియను పూర్తి చేయనివారు తత్కాల్ బుకింగ్‌ (Aadhar kyc for tatkal Tickets)కు అనర్హులు అవుతారు.

IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత "My Account" లోని "Authenticate User" ఆప్షన్ ద్వారా ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ID నమోదు చేసి, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీను ఎంటర్ చేసి ధృవీకరించవచ్చు. ధృవీకరణ విజయవంతం అయితే, మీ ఖాతా KYC ధ్రువీకృతం అయినట్లుగా మెసేజ్ వస్తుంది.

ప్రయాణికులు తమ ఆధార్ లింక్ చేయని వారు వెంటనే చర్య తీసుకోవాలని, అదే సమయంలో ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్ గా ఉందో లేదో ఒకసారి పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బుకింగ్ సమయంలో వచ్చే ఓటీపీ ఆధార్-లింక్డ్ నంబర్‌కే వస్తుంది కాబట్టి.. అవసరమైతే UIDAI ద్వారా మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలి. అలాగే.. తత్కాల్ టికెట్ల బుకింగ్ చాలా వేగంగా జరిగే ప్రక్రియ అయినందున, చివరి నిమిషాల్లో OTP సమస్యలు ఎదుర్కొనకుండా ముందుగానే ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవడం ఉత్తమమని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Next Story