- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
New Year:2025 ఎలా ఉండబోతోంది.. వందల ఏళ్ల కిందటే చెప్పిన నోస్ట్రాడమస్!?
మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది.

దిశ,వెబ్‌డెస్క్: మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. 2024 సంవత్సరానికి ముగింపు పలికి కొత్త ఏడాది 2025 (New Year)లో అడుగు పెట్టబోతున్నాం. దీంతో ఈ ఏడాదిలో ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులకు ముగింపు చెప్పి నూతన ఏడాది పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కొందరైతే ఈ సంవత్సరంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇక వచ్చే ఏడాదిలోనైనా సంతోషంగా ముందుకు వెళ్లాలని అనుకుంటారు. ఈ విధంగా వచ్చే సంవత్సరం పై చాలా మంది హోప్స్ పెట్టుకోవడం సహజమే. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు.
ఈ క్రమంలో రాబోయే కాలంలో ఏం జరగబోతుంది? ఎలాంటి విపత్కర పరిస్థితులు ప్రపంచం ఎదుర్కోబోతుంది? అనే విషయాలపై ప్రపంచంలోని అనేక మంది ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు ముందుగానే అంచనా వేశారు. వాటిని పుస్తకాలు, ఇతర రూపాల్లో పొందుపర్చారు. ఈ క్రమంలో 2025 ఎలా ఉండబోతుందో ఫ్రెంచ్ జ్యోతిషుడైన(French astrologer) నోస్ట్రాడమస్(Nostradamus) విశ్లేషించిన విషయాలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. వచ్చే ఏడాది భూమిని పెద్ద గ్రహశకలం(large asteroid) ఢీకొట్టవచ్చని, లేదా దగ్గరగా రావచ్చని అంచనా వేశారు. ‘దీర్ఘకాలిక యుద్ధం ముగుస్తుంది. బ్రెజిల్‌లో వరదలు, అగ్నిపర్వతం బద్దలవ్వడం వంటి ప్రకృతి వైపరీత్యాలు(Natural calamities) జరుగుతాయి. ప్లేగు వంటి వ్యాధి వ్యాప్తి చెందుతుంది’ అని ఆయన జోస్యం చెప్పారు.






