పెళ్లి చేసుకునేవారికి BIG అలర్ట్.. సర్కార్ సంచలన కండిషన్!

by Gantepaka Srikanth |

పెళ్లి(Marriage) అంటే ముందు ఏడు తరాలు.. వెనుక ఏడు తరాలు చూసి పెళ్లి చేసుకోవాలని పెద్దలు చెబుతుండే వారు.

పెళ్లి చేసుకునేవారికి BIG అలర్ట్.. సర్కార్ సంచలన కండిషన్!
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి(Marriage) అంటే ముందు ఏడు తరాలు.. వెనుక ఏడు తరాలు చూసి పెళ్లి చేసుకోవాలని పెద్దలు చెబుతుండే వారు. కానీ ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు రోజులు మారాయి. ఈ క్రమంలోనే వివాహ వ్యవస్థపై నమ్మకం పెంచేలా మేఘాలయ సర్కార్(Meghalaya Government) కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి ముందు HIV టెస్ట్ చేయించుకోవడాన్ని తప్పనిసరి చేయాలని మేఘాలయ ప్రభుత్వం యోచిస్తోంది. దేశంలో అత్యధిక HIV/ఎయిడ్స్ కేసులున్న రాష్ట్రాల్లో మేఘాలయ ఆరో స్థానంలో ఉంది. ఈ నిర్ణయం వల్ల సమాజానికి ప్రయోజనం కలుగుతుందని, సకాలంలో వ్యాధిని గుర్తించి రోగులకు చికిత్స అందించవచ్చని ఆ రాష్ట్ర మంత్రి అంపరీన్ లింగ్‌తో అన్నారు. గోవాలో ఇప్పటికే ఈ నిబంధన అమలవుతోందని గుర్తుచేశారు.

Next Story