ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అన్నదమ్ములు..అంగరంగ వైభవంగా వివాహం!

by Ajay Maddhiboyina |

ఒక పురుషుడు ఇద్దరు, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఒకే పందిరిలో ఇద్దరిని వివాహమాడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.

ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అన్నదమ్ములు..అంగరంగ వైభవంగా వివాహం!
X

దిశ, వెబ్ డెస్క్: ఒక పురుషుడు ఇద్దరు, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఒకే పందిరిలో ఇద్దరిని వివాహమాడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ హిమాచల్ ప్రదేశ్ లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒకే పందిరిలో యువతి ఇద్దరు అన్నదమ్ములను వివాహం చేసుకుంది. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని హట్టి పాలియాండ్రీ అనే తెగకు సంబంధించిన ఒక సంప్రదాయం. వివారాల ప్రకారం.. సిర్కౌర్ జిల్లాలోని షిల్లాయ్ గ్రామానికి చెందిన ప్రదీప్ నేగి, కపిల్ నేగి అన్నదమ్ములు హట్టి తెగకు సంబంధించిన ఓ వేడుకలో అదే గ్రామానికి చెందిన సునితా చౌహాన్ అనే యువతిని వివాహం చేసుకున్నారు.

చాలా కాలంగా ఆ తెగలో ఈ ఆచారాన్ని ఎవరూ పాటించడంలేదు. కానీ తాజాగా అన్నదమ్ములు ఒకే యువతిని వివాహం చేసుకుని మళ్లీ తమ సంప్రదాయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. ఇక వివాహం చేసుకున్న అన్నదమ్ముల్లో అన్న జలశక్తి డిపార్ట్ మెంట్‌లో ఉద్యోగం చేస్తుండగా తమ్ముడు విదేశాల్లో టూరిజంకు సంబంధించిన ఉద్యోగం చేస్తున్నాడు. ఈ వివాహం గురించి వధువు సునితా చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ..ఈ పెళ్లి తన అంగీకారంతోనే జరిగిందని చెప్పింది. ఇందులో ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేసింది. సంప్రదాయం గురించి తనకు తెలుసని, కాబట్టి చాలా ఇష్టంగా పెళ్లి చేసుకున్నానని చెప్పింది. తాము కలిసి నిర్మించుకున్న బంధంపై నమ్మకం ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంపకాలు ఉండకుండా ఉండేందుకు ఈ ఆచారాన్ని హట్టి పాలియాండ్రీ తెగవాళ్లు పాటిస్తారట.

Next Story