హోటల్ లో రూమ్ బుక్ చేసుకునే వారికి షాక్..అందులో కూడా సీక్రెట్ కెమెరాలు!

by velandi.Saikiran |   (  Updated:2025-08-11 06:37:05  IST  )

సీక్రెట్ కెమెరాలు గోడ గడియారాల్లోనే పెడుతున్నారు.10 గంటల సమయం దగ్గర.. ఎవరికి కనిపించకుండా సీక్రెట్ కెమెరాను అమర్చారు.

హోటల్ లో రూమ్ బుక్ చేసుకునే వారికి షాక్..అందులో కూడా సీక్రెట్ కెమెరాలు!
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా అనేక రకాల స్కాములు, మోసాలు జరుగుతున్నాయి. డబ్బుల కోసం దుర్మార్గులు ఎంతకైనా తెగిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని హోటల్స్ ( Hotels) యాజమాన్యాలు.. కూడా రహస్య వీడియోలను చిత్రీకరించి.. డబ్బులు గుంజుతున్నాయి. ఏకాంతంగా గడిపేందుకు.. హోటల్ కు వెళ్తే.. అక్కడ సీక్రెట్ కెమెరాలు ( hidden cameras ) పెట్టి.. సంసారాలను నాశనం చేస్తున్నారు కొంతమంది.

హోటల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. బాధితులను బెదిరించిన సంఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వెలుగు చూసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. హోటల్ బాత్రూంలలో, గోడలకు, ఫ్యాన్ మధ్యలో ఇలా అనేక రకాల కెమెరాలు పెట్టి.. బండారం బయట పెడుతున్నారు. అయితే తాజాగా మరో వీడియో... హోటల్ యాజమానుల బండారాన్ని బయటపెట్టింది.

సీక్రెట్ కెమెరాలు ఏకంగా.. గోడ గడియారాల్లోనే పెడుతున్నారు. కింది వీడియోలో ఈ విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. 10 గంటల సమయం దగ్గర.. ఎవరికి కనిపించకుండా సీక్రెట్ కెమెరాను అమర్చారు. భూతద్దం పెట్టి చూసినా కూడా మనకు అక్కడ కెమెరా ఉన్నట్లు తెలియదు. అంతలా పెద్ద మోసమే చేస్తున్నారు. అయితే ఇకపై హోటల్స్ లో రూమ్స్ బుక్ చేసుకునే వాళ్ళు... గోడ గడియారాలు ఉన్నాయా? అందులో కెమెరాలు ఉన్నాయా? ఇంకా ఎక్కడైనా కెమెరాలు పెట్టే ఛాన్స్ ఉందా అని గమనించి.. జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని నెటిజెన్స్ ఈ వీడియో కింద కామెంట్స్ చేస్తున్నారు.

Next Story