- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లేడీస్ ట్రయల్ రూమ్‌లో కెమెరా.. ఆ వీడియోలు అన్ని రికార్డ్
అస్సాంలోని బర్పెటా రోడ్‌లోని ప్రముఖ క్లాత్ షో రూమ్‌లో దారుణం చోటు చేసుకుంది. మహిళలు బట్టలు మార్చుకుంటున్న ట్రయల్ రూమ్‌లో సీక్రెట్ కెమెరా గుర్తించబడింది. అక్టోబర్ 30న జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్ల ఆగ్రహానికి

దిశ, వెబ్ డెస్క్ : అస్సాంలోని బర్పెటా రోడ్‌లోని ప్రముఖ క్లాత్ షో రూమ్‌లో దారుణం చోటు చేసుకుంది. మహిళలు బట్టలు మార్చుకుంటున్న ట్రయల్ రూమ్‌లో సీక్రెట్ కెమెరా గుర్తించబడింది. అక్టోబర్ 30న జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. కూతురు, సోదరి, ఫ్రెండ్‌తో కలిసి షాపింగ్‌కు వెళ్లిన ఓ మహిళ క్లాత్స్ ట్రయల్ చేసేందుకు ట్రయల్ రూమ్‌కు వెళ్లింది. కానీ ఏసీ సరిగ్గా రాకపోవడంతో ఫిర్యాదు చేసింది. దీంతో సిబ్బంది దాన్ని చూడగా.. అందులో ఫోన్ దాచి స్త్రీల వీడియోలు రికార్డ్ చేస్తున్నట్లు గుర్తించారు. విచారిస్తే అందులో పని చేస్తున్న ఉద్యోగి అహ్మద్ ఈ పని చేస్తున్నట్లు కనుగొన్నారు.
పోలీసులకు సమాచారమివ్వగా.. అహ్మద్‌ను అరెస్ట్ చేశారు. కాగా ఆ ఫోన్‌లో చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక స్త్రీలకు సంబంధించిన భద్రత ఆందోళనలను హైలెట్ చేస్తుండగా.. మహిళల హక్కుల సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ట్రయల్ రూమ్‌లో రిటైల్ సిబ్బందికి సీసీటీవీ నియమాలు, బ్యాక్ గ్రౌండ్ చెక్‌లను కఠినతరం చేయాలని కోరారు.






