- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరేయ్.. ఏం గుండెరా నీది.. పామునే మింగబోయిన బుడతడు.. చివరికి జరిగింది తెలిస్తే హడలి పోవాల్సిందే..
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం అయిపోయింది. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు దీన్ని తెగ వాడేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం అయిపోయింది. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు దీన్ని తెగ వాడేస్తున్నారు. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు జరిగిన ప్రతి విషయాన్ని నెట్టింట పెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. వైరల్ అవుతున్న వీడియోలో.. పసుపు రంగు టీ-షర్ట్ ధరించిన ఒక చిన్న పిల్లవాడు నేలపై కూర్చుని ఉండగా.. అతని ముందు ఒక పెద్ద పాము (కింగ్ కోబ్రా) ఉంది. అయితే ఆ బాలుడు ఆ పామును మింగడానికి అన్నట్లుగా నోరు తెరిచి మరీ ప్రయత్నిస్తుంటాడు.
అలాగే తన నోటితో పాము పడగను పట్టుకోవడానికి ప్రయత్నించడాన్ని చూడవచ్చు. అదే సమయంలో, పాము ప్రమాదాన్ని గ్రహించి వెంటనే వెనక్కి తగ్గుతుంది. అయినప్పటికీ ఆ పిల్లవాడు మూడు సార్లు అలాగే చేస్తాడు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు పాముతో పరాశకాలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఉంటే దెబ్బకి సచ్చి పడేవాడు అని బాగా తిట్టిపోస్తున్నారు. అలాగే కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఏం గుండెరా నీది అని కామెంట్స్ చేస్తున్నారు.






