- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హృదయాన్ని హత్తుకునే ఘటన.. బాటిల్‌లో అమ్మను ప్రపంచ యాత్రకు పంపిన కూతురు
అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. మాటల్లో వర్ణించలేనిది. తన ఆశల్ని, ఆకాంక్షల్ని పక్కన పెట్టి.. కుటుంబం కోసం, కన్నపిల్లల కోసం జీవితాన్ని త్యాగం చేస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: అమ్మ ప్రేమ (Mother love) వెలకట్టలేనిది. మాటల్లో వర్ణించలేనిది. తన ఆశల్ని, ఆకాంక్షల్ని పక్కన పెట్టి.. కుటుంబం కోసం, కన్నపిల్లల కోసం జీవితాన్ని త్యాగం చేస్తుంది. అలాంటి అమ్మకు మనం ఎంత చేసినా తక్కువే. ఈ నేపథ్యంలో చనిపోయిన తన తల్లి కలను నేరవేర్చాలని ఓ కూతురు చేసిన ప్రయత్నం ప్రపంచాన్ని కదిలించింది. ఒక బాటిల్‌లో తమ అమ్మను ప్రపంచయాత్రకు పంపిన కూతురి ప్రేమ (Daughter's love).. ఇప్పుడు లక్షల మందిని కన్నీటి పర్యంతం చేస్తోంది. మరీ పూర్తి వివరాలేంటో తెలుసుకుందామా!
ఇంగ్లాండ్‌లోని (England) ఓల్డమ్ నగరానికి చెందిన 24 ఏళ్ల కేరా మేలియా తల్లి వెండి చాడ్విక్ (51) ఇటీవల గుండె సంబంధిత సమస్యలతో మరణించారు. వెండి చాడ్విక్‌ను ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండేది. అయితే, ఆమెకు ఐదుగురు సంతానం కావటంతో జీవితాంతం కుటుంబ బాధ్యతలతోనే గడిపారు. ప్రపంచాన్ని చూడాలనే తల్లి కోరిక తీరకుండాలనే మరణించిందని కేరా బాధపడింది. ఆ కలను ఎలాగైనా సాకారం చేయాలని భావించింది. ఈ నేపథ్యంలోనే కేరా తన తల్లి చితాభస్మాన్ని ఒక గాజు సీసాలో ఉంచింది. అందులో 'ఇది మా అమ్మ. ఆమెను మళ్లీ సముద్రంలోకి వదలండి. ఆమె ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది!' అనే నోటు రాసి ఆ సీసాను ఆమె స్కెగ్నెస్ బీచ్ సముద్రంలో వదిలింది.
అయితే, ఆశించినట్టుగా ఆ బాటిల్ ప్రపంచ ప్రయాణం మొదలుపెట్టలేదు. కేవలం 12 గంటల్లోనే అదే బీచ్‌లో ఓ సందర్శకురాలికి ఆ సీసా దొరికింది. 'ఈ అందమైన ఆత్మను మేం స్కెగ్నెస్ బీచ్‌లో కనుగొన్నాం. ఆమె కోరిక మేరకు మళ్లీ సముద్రంలోకి వదిలేశాం. హ్యాపీ ట్రావల్స్, కేరా అమ్మ!' అని ఈ విషయాన్ని ఆ సందర్శకురాలు ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఇది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు.. 'ఇది ఒక్క బాటిల్ కాదు.. ప్రేమతో నిండిన ఓ తల్లి యాత్ర' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.






