సింహాన్ని దగ్గరగా చూడాలని డెన్ లోకి వెళ్ళాడు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో

by Muthe.Rajitha |

జూ పార్కులోకి వెళ్లిన కొందరు ఆకతాయిలు తుంటరి పనులు చేసి అక్కడి క్రూర మృగాల బారిన పడుతుంటారు.

సింహాన్ని దగ్గరగా చూడాలని డెన్ లోకి వెళ్ళాడు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
X

దిశ, వెబ్ డెస్క్ : జూ పార్కులోకి వెళ్లిన కొందరు ఆకతాయిలు తుంటరి పనులు చేసి అక్కడి క్రూర మృగాల బారిన పడుతుంటారు. ఇలాంటి భయానక ఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రెజిల్‌లోని పార్క్ అరూడా కామరా జూలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. సింహాన్ని మరింత దగ్గరగా చూడాలనే తపనతో ఓ వ్యక్తి జూ ఫెన్సింగ్ గోడలను దాటుకుని నేరుగా సింహం ఉన్న డెన్‌లోకి వెళ్లిపోయాడు. అక్కడున్న చెట్టు సహాయంతో కిందకు దిగడానికి ప్రయత్నించడంతో, ఆ కదలికను గమనించిన సింహం అతడిపై ఒక్కసారిగా దాడి చేసింది. వెంటనే అతడిని పొదల్లోకి లాక్కెళ్లి అక్కడే చంపేసింది. జూ సిబ్బంది స్పందించేలోపే ప్రమాదం జరిగిపోయింది. క్రూర జంతువులకు దగ్గరగా వెళ్లడం ఎంత ప్రమాదకరమో మరోసారి ఈ సంఘటన గుర్తుచేసిందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. వీడియో

Next Story