Viral News : భార్య మాట విన్నాడు... రూ.2696 కోట్ల లాటరీ జాక్ పాట్ కొట్టాడు

by Muthe.Rajitha |

భార్య మాట వింటే బాగుపడతారు అనే మాటకి ఈ ఘటనే నిదర్శనం.

Viral News : భార్య మాట విన్నాడు... రూ.2696 కోట్ల లాటరీ జాక్ పాట్ కొట్టాడు
X

దిశ, వెబ్ డెస్క్ : భార్య మాట వింటే బాగుపడతారు అనే మాటకి ఈ ఘటనే నిదర్శనం. న్యూజెర్సీ(New Jersy)కి చెందిన తాయెబ్ సౌమీ(Tayeb Soumi) ఒకరోజు 5 డాలర్లతో జ్యూస్ బాటిల్ కొన్నాడు. దాని ధరను చూసి అతని భార్య.. 'ఈ జ్యూస్ ఖరీదు చాలా ఎక్కువ రిటర్న్ ఇచ్చేయండి' అని చెప్పడంతో సౌమీ అలాగే చేశాడు. అనంతరం ఆ డబ్బుతో ఓ న్యూజెర్సీ లాటరీ(New Jersy Lottery)టికెట్ కొనమని చెబితే అలాగే చేశాడు. ఇంకేముందీ.. ఆ లాటరీ వారి జీవితాన్ని మలుపు తిప్పింది. వారు కొన్న టికెట్ కే జాక్ పాట్ తగలడంతో 315 మిలియన్ల డాలర్లు గెలుచుకున్నారు. అది ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ.2696 కోట్లు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదే విషయాన్ని సౌమీ మీడియాకు వెల్లడిస్తూ.. ఆ రోజు తన భార్య అది వాపస్ ఇవ్వమని చెప్పి ఉండకపోతే ఈరోజు ఇది గెలిచే వాడిని కాదు అని పేర్కొన్నాడు. పెళ్ళాం చెబితే వినాలి అని ఊరికే అనలేదు మరి పెద్దలు.

Next Story