- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమెకు 26.. ఆయనకు 60.. ఇప్పటికే 22మంది సంతానం.. టార్గెట్ 105..
క్రిస్టినా ఓజ్టుర్క్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. మామ్‌ఫ్లుయెన్సర్‌గా పేరు గాంచిన ఆమె వయసు ప్రస్తుతం 26. కానీ సంతానం మాత్రం 22 మంది. 105 మంది పిల్లలను కనడమే ఆమె లక్ష్యం. కాగా ఆమె భర్త గాలిప్ వయసు 60ఏళ్లు కావడం విశేషం. నిజానికి 1998లో పుట్టిన

దిశ, వెబ్ డెస్క్ : క్రిస్టినా ఓజ్టుర్క్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. మామ్‌ఫ్లుయెన్సర్‌గా పేరు గాంచిన ఆమె వయసు ప్రస్తుతం 26. కానీ సంతానం మాత్రం 22 మంది. 105 మంది పిల్లలను కనడమే ఆమె లక్ష్యం. కాగా ఆమె భర్త గాలిప్ వయసు 60ఏళ్లు కావడం విశేషం. నిజానికి 1998లో పుట్టిన క్రిస్టినా పదిహేడేళ్ల వయసులోనే మొదటి బిడ్డకు సహజంగా జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ పార్టనర్ నుంచి విడిపోయింది. బిగ్ ఫ్యామిలీ ఉండాలని కలలుగన్న ఆమె.. 2019లో బిజినెస్ మ్యాన్ గాలిప్ ను కలిసింది. 1965లో పుట్టిన గాలిప్.. టర్కీ మెట్రో టూరిజమ్ కంపెనీ యజమాని. కాగా రియల్ ఎస్టేట్, హోటల్ వ్యాపారాలు కూడా కలిగి ఉన్నాడు. దాదాపు 35ఏళ్ల ఏజ్ గ్యాప్ కలిగిన ఇద్దరు.. తమ ఆలోచనలు కలవడంతో పెళ్లి చేసుకున్నాడు. బుటామిలోని లగ్జరీ మాన్షన్‌లో కాపురం పెట్టారు.
నిజానికి వీరిద్దరు ఏడాదికో బిడ్డను కనేందుకు ప్లాన్ చేశారు. కానీ అది సాధ్యపడదని గుర్తించి.. సరోగసీ ద్వారా బిడ్డలను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2020 నుంచి 2021 మధ్య పదహారు నెలల్లో 21 మంది పిల్లలను సరోగసీ ద్వారా వెల్ కమ్ చేశారు. ఇందుకోసం లక్షా ఎనభై వేల డాలర్లు ఖర్చు చేశారు. అయితే వీరి వివాహం, పిల్లలను కనేందుకు ఎంచుకున్న మార్గం ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటుంది. తల్లిదండ్రులు సంరక్షించకుండా నానీలను పెట్టుకుని పిల్లలను పెంచడం ఇందుకు కారణం. అంతేకాదు గాలిప్‌పై ఇప్పటికీ పలు నేరారోపణలు ఉన్నాయి. ఓ హత్య కేసులో టర్కీలో శిక్ష అనుభవించిన గాలిప్.. 2018లో జార్జియా పారిపోయాడు. మనీ లాండరింగ్, డాక్యుమెంట్ ఫోర్జరీ కేసులో బుటామిలో 2022లో అరెస్ట్ అయ్యాడు. 2023లో డ్రగ్ కేసులో అరెస్ట్ కాగా జైలు శిక్ష అనుభవిస్తూ ఈ ఏడాది జూలైలో బెయిల్‌పై విడుదలయ్యాడు. మరో వైపు క్రిస్టినా ఇన్‌స్టాగ్రామ్‌లో బిజీగా ఉంది. అందుకే ఇలాంటి తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచగలరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






