- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వినూత్న పెళ్లి ప్రకటనతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయ్యాడు.. రెండు బిల్డింగులు ఉన్నాయంటూ..!
ప్రస్తుత కాలంలో పెళ్లి సంబంధాలు ఏర్పరచుకోవడం యువతకు పెద్ద సవాలుగా మారుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత కాలంలో పెళ్లి సంబంధాలు (Marital relations) ఏర్పరచుకోవడం యువతకు పెద్ద సవాలుగా మారుతోంది. వయసు పెరుగుతున్నప్పటికీ జీవిత భాగస్వామి దొరకకపోవడం, నచ్చిన వ్యక్తిని కనుగొనడం కష్టంగా మారడంతో, కొందరు యువకులు సంప్రదాయ మార్గాల కంటే ప్రత్యేకమైన, వింత ప్రయత్నాలు చేస్తున్నారు. మామూలుగా అయితే పెళ్లిళ్ల బ్రోకర్లను కలుస్తారు, మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో ప్రొఫైల్ నమోదు చేస్తారు లేదా తెలిసిన వారికి తమ బయోడేటా ఇచ్చి సంబంధాల వేట మొదలెడుతారు. కానీ, చైనాకు చెందిన ఓ యువకుడు మాత్రం దీన్ని పూర్తిగా భిన్నంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే ఇప్పుడు అతడిని ఓవర్ నైట్ సెలబ్రిటీని (Overnight Celebrity) చేసింది. ఇంతకీ అతనేం చేశాడు? ఇక్కడ తెలుసుకుందాం.
చైనాలోని (China) గ్వాంగ్‌జౌ నగరంలో మే 31న డ్రాగన్ బోట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ వేడుకల్లో లిన్ అనే 35 ఏళ్ల యువకుడు అక్కడి వచ్చిన వారి దృష్టిని ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడు. ఎందుకంటే.. అతడి మెడలో ఓ పెద్ద ప్లకార్డు ధరించి, అందులో ఇలా రాశాడు.. 'అవివాహితుడు, హైజూ, రెండు బిల్డింగ్‌లు'. ఇక తన వద్ద ఉన్న రెండు బిల్డింగ్‌లు తల్లి పేరుపై హైజూలో ఉన్నాయని, అవన్నీ ఇప్పటికే అద్దెకు ఇచ్చామని స్పష్టం చేశాడు. ఈ ప్రకటన తనకు జీవిత భాగస్వామిని కనుగొనాలనే ఉద్దేశంతో చేసానని చెప్పారు. ఈ ప్రకటనతో పాటు అతని సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన QR కోడ్ కూడా ప్లకార్డుపై ఉంచాడు. అక్కడికి వచ్చిన సందర్శకులు, ఆన్‌లైన్‌లో చూసినవాళ్లు ఒక్కసారిగా అతనిపై ఆసక్తి కనబరిచారు. అతి తక్కువ సమయంలో అతను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.
అయితే, లిన్‌కి ఈ ఐడియా తన స్నేహితుడు ఇచ్చినట్లు తెలిపాడు. వింతగా అనిపించిన ఒకసారి ప్రయత్నించి చూద్ధామని ట్రై చేసినట్లు చెప్పాడు. ఇక ఇది చూసి అతనికి ఇప్పటివరకు 1000 మందికి పైగా సందేశాలు వచ్చాయని లిన్ తెలిపాడు. అయితే, తనతో కలిసి జీవనం సాగించే అమ్మాయికి కుటుంబం విలువలు బాగా తెలిసి ఉండాలని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. కాగా, ఈ ఘటన వింతగా అనిపించినా.. ప్రస్తుత యువత మధ్య పెళ్లికి సంబంధించి ఎదురు చూపులు, తీరని ఆశలు, వాటిని సాధించేందుకు ప్రయత్నాలు ఎంత విభిన్నంగా మారుతున్నాయో చాటుతోంది. ఒక ప్లకార్డు సహాయంతో వైరల్ కావడం, అనేక మంది నుంచి స్పందన పొందడం లాంటి విశేషాలు ఇప్పుడు ‘క్రియేటివ్ మ్యాట్రిమోనీ’కి ఉదాహరణగా నిలుస్తున్నాయి.






